Bigg Boss 7 Day 23 : ఈ సారి నామినేషన్స్ వెరైటీగా.. ఈ వారం నామినేషన్స్ లో ఎవరెవరు ఉన్నారు?

నాలుగో వారం మొదలవ్వగా సోమవారం చప్పగా సాగింది. మంగళవారం మాత్రం నామినేషన్స్ తో ఫుల్ ఫైర్ మీద సాగింది బిగ్‌బాస్ ఎపిసోడ్. ఈ సారి నామినేషన్స్ కొంచెం కొత్తగా చేయించాడు బిగ్‌బాస్.

Bigg Boss 7 Day 23 : ఈ సారి నామినేషన్స్ వెరైటీగా.. ఈ వారం నామినేషన్స్ లో ఎవరెవరు ఉన్నారు?

Bigg Boss 7 Day 23 Highlights Bigg Boss Nominations Week

Updated On : September 27, 2023 / 6:59 AM IST

Bigg Boss 7 Day 23 : బిగ్‌బాస్ అప్పుడే మూడు వారాలు ముగిసింది. ముగ్గురు ఎలిమినేట్ అయ్యారు. నాలుగో వారం మొదలవ్వగా సోమవారం చప్పగా సాగింది. మంగళవారం మాత్రం నామినేషన్స్ తో ఫుల్ ఫైర్ మీద సాగింది బిగ్‌బాస్ ఎపిసోడ్. ఈ సారి నామినేషన్స్ కొంచెం కొత్తగా చేయించాడు బిగ్‌బాస్. పవరాస్త్ర గెలుచుకున్న ముగ్గురు శివాజీ, సందీప్, శోభాశెట్టి లను జ్యురి మెంబర్స్ గా పెట్టి ఒక్కొక్క కంటెస్టెంట్ వచ్చి నామినేట్ చేయాలనుకున్న ఇద్దరిని బోనులో నిలబెట్టి ఎందుకు చేస్తున్నారో కారణాలు చెప్తే అందులో ఒకరిని జ్యురి మెంబర్స్ నామినేట్ చేస్తారు.

దీంతో ఈ సారి మరింత గొడవలు ఎక్కువయ్యాయి. కంటెస్టెంట్స్ కావాలనుకున్న వాళ్ళని కాకుండా జ్యురి మెంబర్స్ నామినేట్ చేస్తుండటంతో అటు నామినేట్ చేసే వాళ్లకి, నామినేట్ అయిన వాళ్లకి, జ్యురి మెంబర్స్ ముగ్గురి మధ్య గొడవలు జరిగాయి. మొత్తానికి ఈ వారం నామినేషన్స్ లో ప్రియాంక, రతిక, ప్రిన్స్, శుభశ్రీ, గౌతమ్, తేజ ఉన్నారు. మరి ఈ వారం వీరిలో నుంచి ఎవరు ఎలిమినేట్ అవుతారో చూడాలి.

Also Read : Sai Dharam Tej – Swathi : కాలేజీ టైంలో స్వాతి పేపర్‌ కాపీ కొట్టి పాస్ అయిన సాయి ధరమ్ తేజ్..

ఇక ఓ పక్క నామినేషన్స్ గొడవ జరుగుతుంటే మరో పక్క ప్రశాంత్, రతిక గొడవ మళ్ళీ షురూ అయింది. రతిక డ్రెస్సింగ్ గురించి ప్రశాంత్ మాట్లాడింది గౌతమ్ గుర్తుచేయడంతో రతిక ఫైర్ అయింది. నువ్వెవడివి న నాగురించి మాట్లాడటానికి అంటూ ప్రశాంత్ మీద అరిచింది రతిక. దీంతో ప్రశాంత్ అసలు నీ గురించి నాకు ఎందుకు, నిన్ను పట్టించుకోను, కావాలంటే అక్క అని పిలిచేస్తాను అని అన్నాడు. దీంతో అంతా షాక్ అయ్యారు. ఇన్నాళ్లు ఆమె వెంటపడి, ఆమెతో ప్రేమాయణం కోసం ట్రై చేసి ఇప్పుడు అక్క అనేశాడు ప్రశాంత్. మరి బిగ్‌బాస్ దీనిపై ఎలా స్పందిస్తాడో చూడాలి. ఇన్నాళ్లు బిగ్‌బాస్ ని వీళ్లిద్దరి మీదే ఎక్కువగా నడిపించారు. ఇప్పుడు ప్రశాంత్ రతికని అక్క అనేయడంతో ఎపిసోడ్స్ ఎలా ప్లాన్ చేస్తారో చూడాలి.