బిగ్‌బాస్ ఎలిమినేషన్: ఈ వారం జోర్దార్ సుజాత అవుట్

10TV Telugu News

Bigg Boss Elimination: బిగ్ బాస్.. అదొక మాయా ప్రపంచం.. అందులో అందరూ నటించాలని వస్తారు.. కానీ ఒరిజినల్ క్యారెక్టర్‌ బయట పెట్టుకుని బయటకు వచ్చేస్తూ ఉంటారు.. మూడు సీజన్లుగా జరిగింది ఇదే.. ఈ సీజన్‌లో జరుగుతుంది అదే.. ఈ ప్రాసెసే ప్రజలకు బిగ్‌బాస్‌పై ఇంట్రస్ట్ క్రియేట్ చేస్తుంది.ప్రతి వారం నామినేషన్.. వారం చివరిలో నామినేషన్ మాములే కదా? ఈ క్రమంలోనే ఐదోవారం ఎలిమినేషన్ ప్రక్రియ కూడా ఆసక్తికరంగానే జరిగింది. ఒకరిపై ఒకరు ఆరోపణలు, విమర్శలు, గొడవలు జరుగుతూనే ఉండగా.. ఏకంగా తొమ్మిది మంది ఎలిమినేషన్‌కి నామినేట్ అయ్యారు.

ఈ వారం ఎలిమినేషన్ నామినేషన్‌లో అఖిల్, అభిజిత్, నోయల్, సొహైల్, రాజశేఖర్, మోనాల్, లాస్య, సుజాత, అరియానాలు నామినేట్ అయ్యారు. ఈ తొమ్మిది మందిలో ఎవరు ఎలిమినేట్ కాబోతున్నారో అప్పుడే లీక్ అయిపోయింది. ఈరోజు(11 అక్టోబర్ 2020) రాత్రికి ప్రసారం కాబోతున్న షోలో జోర్దార్ సుజాత ఖచ్చితంగా ఎలిమినేట్ కావడం ఖాయమే అంటూ లీక్ వార్త వచ్చేసింది.తొలి మూడు వారాలు నలుగురితో నారాయణ అన్నట్టుగానే ఉన్న సుజాత.. కాయిన్ టాస్క్ తరువాత యాటిట్యూట్ మొత్తం మారిపోయింది. ముఖ్యంగా ఆమె వెకిలి నవ్వే ఆమెకు శాపంగా మారిపోయాంది. కారణం లేకుండా నవ్వడం ప్రేక్షకులకు కాస్త చికాకు పుట్టించినట్లుగానే ఉంది.అంతవరకు అయితే ఓకే కానీ, నాగార్జునను బిట్టూ బిట్టూ అని పిలవడం అతిగానే అనిపిస్తుంది. కెమెరా ముందుకు వచ్చి పదే పదే మాట్లాడటం.. సిల్లీ రీజన్స్‌తో నామినేట్ చేయడం.. సరదాగా జోక్ చేసినా సీరియస్ అయిపోవడం లాంటివి ఆమెకు నెగెటివ్ మైలేజ్ వచ్చేలా చేశాయి. దీంతో మొత్తానికి ఐదవ వారంలో సుజాత అవుట్ అయిపోతుంది.వాస్తవానికి జోర్దార్ సుజాత ఇప్పుడప్పుడే బిగ్‌బాస్ హౌజ్ నుంచి వెళ్లిపోవాల్సిన కేరక్టర్ ఏమీ కాదు. ప్రతి టాస్కులో సూపర్ యాక్టీవ్‌గా పాల్గొంటుంది. అందరినీ కెలుకుతూ ఉంటుంది. బిగ్‌బాస్ సరిగ్గా సరిపోయే క్యారెక్టరే.. కాకపోతే ఆమె ఏది చేసినా చూసేవాడికి ఆర్టిఫిషియల్‌గా అనిపిస్తుంది. అదే ఆమెకు మైనస్. ఇంకేముంది ఓట్లు పడలేదు. చివరకు ఎలిమినేట్ అయిపోతుంది.ఇక సుజాత తరువాత ఎక్కువ రిస్క్ అమ్మా రాజశేఖర్ మాస్టర్‌కే. ఇప్పుడు ఉన్న లెక్కల ప్రకారం వచ్చే వారం ఎలిమినేషన్‌కి నామినేట్ అయితే మాత్రం సార్వాడు బ్యాగ్ సర్ధుకుని బయటకు రావల్సిందే. చూడాలి మరి బిగ్ బాస్ కదా? ఏమైనా జరగొచ్చు.