Subhashree Rayaguru : బిగ్‌బాస్ సీజన్ 7లో ఐదవ కంటెస్టెంట్.. శుభశ్రీ రాయగురు.. మోడల్ నుంచి హీరోయిన్ గా..

బిగ్‌బాస్ సీజన్ 7లో ఐదవ కంటెస్టెంట్ గా శుభశ్రీ రాయగురు ఎంట్రీ ఇచ్చింది.

Subhashree Rayaguru : బిగ్‌బాస్ సీజన్ 7లో ఐదవ కంటెస్టెంట్.. శుభశ్రీ రాయగురు.. మోడల్ నుంచి హీరోయిన్ గా..

Bigg Boss Season 7 Fifth Contestant Subhashree Rayaguru Model Turns Actor and Heroine

Updated On : September 4, 2023 / 7:36 AM IST

Subhashree Rayaguru : తెలుగు పాపులర్ రియాల్టీ షో బిగ్‌బాస్ సీజన్ 7 నిన్న సెప్టెంబర్ 3 ఆదివారం నాడు గ్రాండ్ గా మొదలైంది. ఈసారి కూడా నాగార్జునే (Nagarjuna) బిగ్ బాస్ హోస్ట్ గా చేస్తున్నారు. బిగ్‌బాస్ సీజన్ 7 స్పెషల్ పర్ఫార్మెన్స్ లతో, సెలబ్రిటీ గెస్ట్ లతో గ్రాండ్ గా మొదలైంది. ఇవాల్టినుంచి సోమవారం టు శుక్రవారం.. రాత్రి 9.30 గంటలకు, శని, ఆది వారాల్లో రాత్రి 9 గంటలకు బిగ్‌బాస్ షో స్టార్ మా (Star Maa) ఛానల్ లో ఎంటర్టైన్ చేయనుంది. అలాగే డిస్నిప్లస్ హాట్ స్టార్ (Disney Plus Hotstar) లో 24 గంటలు లైవ్ స్ట్రీమ్ కానుంది.

ఈసారి బిగ్‌బాస్ సీజన్ 7లోకి మొత్తం 14 మంది కంటెస్టెంట్స్ వచ్చారు. ఇందులో కొంతమంది అందరికి తెలిసిన వాళ్ళు ఉండగా కొంతమంది మాత్రం సోషల్ మీడియాలో మాత్రమే పాపులారిటీ తెచ్చుకున్న వాళ్ళని తీసుకొచ్చారు. బిగ్‌బాస్ సీజన్ 7లో ఐదవ కంటెస్టెంట్ గా శుభశ్రీ రాయగురు ఎంట్రీ ఇచ్చింది.

శుభశ్రీ మోడలింగ్ తో కెరీర్ మొదలుపెట్టింది. ఫెమినా మిస్ ఇండియా ఒడిశాతో పాలు పలు టైటిల్స్ గెలుచుకుంది. అనంతరం నటిగా ప్రయాణం మొదలుపెట్టిన శుభశ్రీ సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా చేసింది. హీరోయిన్ గా కూడా రుద్రవీణ, కథ వెనుక కథ లాంటి పలు చిన్న సినిమాల్లో నటించింది. కళ్యాణ్ రామ్ అమిగోస్ సినిమాలో పవర్ ఫుల్ పోలీసాఫీసర్ గా నటించింది. అలాగే తమిళ్, తెలుగు సీరియల్స్ తో గుర్తింపు తెచ్చుకుంది శుభశ్రీ. ప్రస్తుతం సీరియల్స్, సినిమాల్లో క్యారెక్టర్స్ చేసుకుంటూ వెళ్తుంది.

Prince Yawar : బిగ్‌బాస్ సీజన్ 7లో నాల్గవ కంటెస్టెంట్.. మోడల్ ప్రిన్స్ యావర్.. సిక్స్ ప్యాక్ బాడీతో అదరగొడుతున్నాడుగా..

తాజాగా ఇలా బిగ్ బాస్ లోకి ఎంట్రీ ఇచ్చింది ఈ భామ. సోషల్ మీడియాలో అప్పుడప్పుడు హాట్ హాట్ ఫోటోలు పెడుతూ అలరిస్తూ ఫాలోవర్స్ ని కూడా పెంచుకుంటుంది. మరి తన అందంతో, ఆటతో బిగ్ బాస్ లో ఎలా మెప్పిస్తుందో చూడాలి.