Damini Bhatla : బిగ్‌బాస్ సీజన్ 7లో మూడవ కంటెస్టెంట్.. సింగర్ దామిని గురించి.. పాడుతా తీయగా నుంచి ప్రస్థానం..

బిగ్‌బాస్ సీజన్ 7లో మూడవ కంటెస్టెంట్ గా సింగర్(Singer) దామిని భట్ల వచ్చింది.

Damini Bhatla : బిగ్‌బాస్ సీజన్ 7లో మూడవ కంటెస్టెంట్.. సింగర్ దామిని గురించి.. పాడుతా తీయగా నుంచి ప్రస్థానం..

Bigg Boss Season 7 Third Contestant Singer Damini Bhatla Life story

Damini Bhatla :  తెలుగు పాపులర్ రియాల్టీ షో బిగ్‌బాస్ సీజన్ 7 నిన్న సెప్టెంబర్ 3 ఆదివారం నాడు గ్రాండ్ గా మొదలైంది. ఈసారి కూడా నాగార్జునే (Nagarjuna) బిగ్ బాస్ హోస్ట్ గా చేస్తున్నారు. బిగ్‌బాస్ సీజన్ 7 స్పెషల్ పర్ఫార్మెన్స్ లతో, సెలబ్రిటీ గెస్ట్ లతో గ్రాండ్ గా మొదలైంది. ఇవాల్టినుంచి సోమవారం టు శుక్రవారం.. రాత్రి 9.30 గంటలకు, శని, ఆది వారాల్లో రాత్రి 9 గంటలకు బిగ్‌బాస్ షో స్టార్ మా (Star Maa) ఛానల్ లో ఎంటర్టైన్ చేయనుంది. అలాగే డిస్నిప్లస్ హాట్ స్టార్ (Disney Plus Hotstar) లో 24 గంటలు లైవ్ స్ట్రీమ్ కానుంది.

ఈసారి బిగ్‌బాస్ సీజన్ 7లోకి మొత్తం 14 మంది కంటెస్టెంట్స్ వచ్చారు. ఇందులో కొంతమంది అందరికి తెలిసిన వాళ్ళు ఉండగా కొంతమంది మాత్రం సోషల్ మీడియాలో మాత్రమే పాపులారిటీ తెచ్చుకున్న వాళ్ళని తీసుకొచ్చారు. బిగ్‌బాస్ సీజన్ 7లో మూడవ కంటెస్టెంట్ గా సింగర్(Singer) దామిని భట్ల వచ్చింది.

రాజమండ్రిలో పుట్టిన దామిని ఆ తర్వాత కుటుంబం హైదరాబాద్ కి షిఫ్ట్ అవ్వగా చిన్నప్పట్నుంచి చదువుకుంటూనే సంగీతం వైపు అడుగులు వేసింది. 2011 లో పాడుతా తీయగా షోలో రెండో స్థానంలో నిలిచింది. ఆ తర్వాత స్టేజి షోలు, ప్రైవేట్ ఆల్బమ్స్, ప్రైవేట్ బ్యాండ్, సినిమాల్లో సాంగ్స్ తో మంచి గుర్తింపు తెచ్చుకుంది. సోషల్ మీడియాలో కూడా రెగ్యులర్ గా యాక్టివ్ గా ఉంటూ ఫాలోవర్స్ ని పెంచుకుంటుంది. ఇటీవల కొండపొలం సినిమాలోని ధమ్ ధమ్ పాటకు బెస్ట్ లిరిక్స్ నేషనల్ అవార్డు వచ్చిన సంగతి తెలిసిందే. ఆ పాట పాడింది దామినినే.

Sivaji : బిగ్‌బాస్ సీజన్ 7లో రెండవ కంటెస్టెంట్.. నటుడు శివాజీ.. ఆఫర్లు లేవా.. బిగ్‌బాస్ నుంచి రాజకీయాలు చేస్తారా?

బిగ్ బాస్ స్టేజిపై దామిని మరోసారి ఆ పాట పాడి వినిపించింది. ప్రతిసారి షోలో ఒక సింగర్ ని ఉండేలా చూసుకుంటారు. ఈ నేపథ్యంలోనే సింగర్ దామిని వచ్చినట్టు తెలుస్తుంది. మరి ఈ సారి బిగ్ బాస్ షోలో దామిని తన పాటలతో ఎలా అలరిస్తుందో చూడాలి.