Bigg Boss Sivaji : హౌస్‌లో శివాజీకి గాయం..? బయటకి పంపించేసిన బిగ్‌బాస్..

నిన్న ఎపిసోడ్ అయిన తర్వాత చూపించిన ప్రోమోలో శివాజీ కూడా హౌస్ నుంచి ఇవాళ బయటకు వెళ్తున్నట్టు చూపించారు.

Bigg Boss Sivaji : హౌస్‌లో శివాజీకి గాయం..? బయటకి పంపించేసిన బిగ్‌బాస్..

Bigg Boss Sivaji exit from Hose due to hand Injury news goes viral

Updated On : October 16, 2023 / 9:40 AM IST

Bigg Boss Sivaji : బిగ్‌బాస్ ఇప్పటికి ఆరు వారాలు పూర్తయింది. అయితే ఆరు వారాలు కూడా లేడీ కంటెస్టెంట్స్ ఎలిమినేట్ అవ్వడం గమనార్హం. నిన్నటి ఆదివారం ఎపిసోడ్ లో నయని పావని ఎలిమినేషన్ అయింది. నిన్న ఎపిసోడ్ అయిన తర్వాత చూపించిన ప్రోమోలో శివాజీ కూడా హౌస్ నుంచి ఇవాళ బయటకు వెళ్తున్నట్టు చూపించారు.

శివాజీని బిగ్‌బాస్ కన్ఫెషన్ రూమ్ కి తీసుకెళ్లాడు. అక్కడ మిమ్మల్ని బయటకు తీసుకెళతాం అని చెప్పాడు బిగ్‌బాస్. శివాజీ బయటకి వచ్చి నేను వెళ్ళిపోతున్నాను అని కంటెస్టెంట్స్ కి చెప్పడంతో వద్దని అందరూ ఆపడానికి ట్రై చేశారు. అంతలోనే హౌస్ డోర్స్ తెరుచుకోవడంతో శివాజీ బయటకి వెళ్ళిపోయాడు. మరి శివాజీని నిజంగానే బయటకి పంపించేసారా? లేదా గేమ్ లో భాగంగా ఏదైనా కొత్తగా చేస్తున్నారా తెలియాలి.

Also Read : Nani : సినిమాల్లో లిప్ కిస్‌లపై క్లారిటీ ఇచ్చిన నాని.. మా ఇంట్లో గొడవలు అవుతాయి కానీ..

అయితే ఐదోవారంలో కెప్టెన్సీ టాస్క్ జరిగినప్పుడు వైర్లు కింద నుంచి పాకుతూ వెళ్లే టాస్క్ ఇచ్చారు. ఆ టాస్క్ లో శివాజీ గాయపడ్డాడు. శివాజీకి భుజం దగ్గర దెబ్బ తగిలింది. అయితే ఇన్నాళ్లు భుజం నొప్పితోనే ఆడాడని. ఇప్పుడు ట్రీట్మెంట్ కోసం బయటకు తీసుకొచ్చారని తెలుస్తుంది. మరి శివాజీ ఎందుకు బయటకి వచ్చేసాడు? భుజం నొప్పి ఉందా? గాయపడ్డాడా? తెలియాలంటే ఇవాళ్టి ఎపిసోడ్ చూడాల్సిందే.