బిగ్‌బాస్ 4: కింగ్ నాగార్జున గ్రాండ్ ఎంట్రీ..

  • Published By: vamsi ,Published On : September 6, 2020 / 06:45 PM IST
బిగ్‌బాస్ 4: కింగ్ నాగార్జున గ్రాండ్ ఎంట్రీ..

బాలీవుడ్‌లో సంచలనాలు క్రియేట్ చేసి తెలుగు బుల్లితెరపై మూడు సీజన్లు.. విపరీతమైన టీఆర్‌పీతో దూసుకుపోయిన బిగ్‌బాస్ ఇప్పుడు మరోసారి ఎంటర్‌టైన్ చెయ్యడానికి సిద్ధం అయ్యింది. (సెప్టెంబర్ 6)న బిగ్‌బాస్ ప్రారంభమైంది. ఆదివారం సాయంత్రం 6 గంటలకు షో మొదలవగా.. మూడవ సీజన్‌లో హోస్ట్ చేసిన నాగార్జున ఎప్పటిలానే అదిరిపోయే ఎంట్రీ ఇచ్చారు.

ఆయన సినిమాల్లోని పాటలకు స్టెప్పులేశారు. అయితే, ఈ షోలో హోస్ట్ నాగార్జున డ్యుయల్ రోల్‌తో దర్శనం ఇవ్వడం విశేషం. ముందు హోస్ట్ నాగార్జున అడుగుపెట్టగా.. ఆయన తండ్రి పాత్రలో అతిథిగా ముసలి నాగార్జున వచ్చారు. ఆయన బిగ్ బాస్ హౌజ్‌లోకి వెళ్లి కలియతిరిగారు. తన స్టైల్లో చమత్కారాలు చేస్తూ ఆకట్టుకున్నారు.

ఎన్నో మలుపులు, మరెన్నో వాయిదాలు పడుతూ.. మొత్తంగా తెలుగు ప్రేక్షక దేవుళ్లను అలరించేందుకు వచ్చిన బిగ్‌బాస్ షోలో అదిరిపోయేలా ఎంట్రీ ఇచ్చిన నాగ్.. మాస్క్ ముఖానికి కానీ ఎంటర్టైన్మెంట్‌కు కాదంటూ మాస్ సాంగ్ స్టెప్పులు వేశాడు. ఆపై నువ్వువస్తావని సినిమాలోని కలలోనైనా కలగనలేదనే పాటకు స్టెప్పులు వేశాడు. కింగ్ నాగ్ అదరగొట్టేయగా.. అందమైన భామలతో చిందులు వేస్తూ దుమ్ములేపాడు.