Bigg Boss 5 : బిగ్ బాస్ లో ఈ సారి ఎలిమినేట్ అయ్యేది ఎవరు? నిన్న కూతురు.. రేపు తల్లి?

నామినేషన్స్ లో కూడా ఒకరి పై ఒకరు వాళ్ళ కోపాన్ని చూపిస్తూ సిల్లీ కారణాలకి కూడా నామినేట్ చేస్తున్నారు. బిగ్ బాస్ ఈ నామినేషన్స్ టాస్క్ కూడా వెరైటీ గా పెడుతున్నాడు. ఈసారి

Bigg Boss 5 : బిగ్ బాస్ లో ఈ సారి ఎలిమినేట్ అయ్యేది ఎవరు? నిన్న కూతురు.. రేపు తల్లి?

Bb5

Bigg Boss 5 :  బిగ్ బాస్ సీజన్ 5 రోజు రోజుకి ఆసక్తికరంగా మారుతుంది. రోజూ గొడవలతోనే సాగిపోతుంది. నామినేషన్స్ లో కూడా ఒకరి పై ఒకరు వాళ్ళ కోపాన్ని చూపిస్తూ సిల్లీ కారణాలకి కూడా నామినేట్ చేస్తున్నారు. బిగ్ బాస్ ఈ నామినేషన్స్ టాస్క్ కూడా వెరైటీ గా పెడుతున్నాడు. ఈసారి శ్రీరామ్‌, సిరి, రవి, కాజల్‌, జెస్సీ, ప్రియ, యానీ,లోబోలు ఎలిమినేషన్‌ జోన్‌లో ఉన్నారు. ఇప్పటిదాకా బిగ్‌బాస్‌ షో నుంచి ఆరుగురు ఎలిమినేట్‌ అయ్యారు. అందులో సరయు, ఉమాదేవి, లహరి, హమీదా, శ్వేత ఐదుగురు ఆడవాళ్లే. ఒక మేల్‌ కంటెస్టెంట్‌ నటరాజ్‌ మాస్టర్‌ ఉన్నారు. దీంతో ఈసారి ఎవరు ఎలిమినేట్ అవుతారో అని ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

Bigg Boss 5 : విచిత్రమైన కెప్టెన్ టాస్క్.. గుడ్ల కోసం కొట్టుకున్న కంటెస్టెంట్స్

ప్రస్తుతం ఉన్న బిగ్ బాస్ ని బట్టి అనాలసిస్ చేస్తే రవి, శ్రీరామ్‌ స్ట్రాంగ్‌ కంటెస్టెంట్స్‌ గా ఉన్నారు. రవి ప్రతి వారం నామినేట్ అవుతున్నాడు అయినా సేఫ్ గా ఎక్కువ ఓట్లు పడుతున్నాయి. ఈ సారి కూడా సేఫ్ అవుతాడు కచ్చితంగా. వరుసగా అమ్మాయిలంతా వెళ్లిపోతున్నారు కాబట్టి షోలో గ్లామర్‌ కోసం అయినా సిరిని, కాజల్ ని ఉండేలా చేసే ఛాన్సులు ఉన్నాయి. పైగా షణ్ముఖ్‌తో స్నేహం వల్ల ఈ సారి షన్ను నామినేషన్స్ లో లేకపోవడం వల్ల అతడి ఫ్యాన్స్‌ కూడా సిరికే ఓట్లేసే అవకాశం ఉంది. ప్రియకు సినిమా, బుల్లితెర సెలబ్రిటీల మద్దతు ఉండటంతో సేఫ్ అవుతూ వస్తుంది. ఈ మధ్య గేమ్ కూడా బాగా ఆడుతుండటంతో ప్రియా ఎలిమినేట్ అయ్యే ఛాన్స్ తక్కువగానే ఉంది.

Sharukh Khan : ఆర్యన్ కేసుతో ఆగిపోయిన షారుఖ్ సినిమాలు

ఇక జెస్సిని చాల మంది ఇంకా అమాయకుడని అనుకుంటున్నారు. అంతేకాక అందరి కంటే చిన్నవాడు కావడం, షన్నుతో దోస్తీ చేయడం జెస్సికి కలిసి వస్తున్నాయి. ఇక లోబోని ప్రస్తుతం ఫేక్ ఎలిమినేషన్ కింద వారం అంతా సీక్రెట్ రూమ్ లోనే ఉంచే ఛాన్స్ వుంది కాబట్టి బయటకి రాగానే పంపించరు. ఇక మిగిలింది యాని మాస్టర్. యాని మాస్టర్ ఈ మధ్య అందరి మీద అరవడం, తనకి ఫేవర్ గా ఉన్న కంటెస్టెంట్స్ ఎలిమినేట్ అవ్వడం వల్ల కొంచెం మైనస్ అవుతుంది. మొన్న తాను కూతురు అనే శ్వేతా వర్మ ఎలిమినేట్ అవ్వడంతో ఆమె ఫ్యాన్స్ ఓట్లు ఏమన్నా పడితే యాని మాస్టర్ సేఫ్ అవుతుంది. లేకపోతే ఈ సారి యాని మాస్టర్ వెళ్లాల్సి వస్తుంది అనే అనుమానాలు వస్తున్నాయి. ఒకవేళ ఇన్ని రోజులు అమ్మాయిలు ఎక్కువగా వెళ్లారు ఈ సారి అబ్బాయిలనే పంపించాలని నిర్ణయం తీసుకుంటే మాత్రం జెస్సీ లేదా లోబో ఎలిమినేట్‌ అయ్యే అవకాశం ఉంది. ఎవరు ఎలిమినేట్ అవుతారో తెలియాలి అంటే వారం చివరి దాకా వెయిట్ చేయాల్సిందే.