Bimbisara: రిలీజ్ ట్రైలర్‌తో కళ్యాణ్ రామ్ అరాచకం.. ఈసారి కొట్టేలాగే ఉన్నాడు!

నందమూరి కళ్యాణ్ రామ్ నటిస్తున్న ‘బింబిసారా’ చిత్రం ఇప్పటికే ప్రేక్షకుల్లో అదిరిపోయే అంచనాలను క్రియేట్ చేసింది. తాజాగా ఈ సినిమా నుండి రిలీజ్ ట్రైలర్‌ను యంగ్ టైగర్ ఎన్టీఆర్ రిలీజ్ చేశారు.

Bimbisara: రిలీజ్ ట్రైలర్‌తో కళ్యాణ్ రామ్ అరాచకం.. ఈసారి కొట్టేలాగే ఉన్నాడు!

Bimbisara Release Trailer Increases Hype On Movie Success

Bimbisara: నందమూరి కళ్యాణ్ రామ్ నటిస్తున్న తాజా చిత్రం ‘బింబిసారా’ ఇప్పటికే షూటింగ్ పనులు ముగించుకుని రిలీజ్‌కు రెడీ అయ్యింది. ఈ సినిమాను దర్శకుడు వశిష్ట తెరకెక్కిస్తుండగా హిస్టారికల్ ఫాంటెసీ మూవీగా ఈ సినిమా వస్తుండటంతో ఈ చిత్రంపై భారీ అంచనాలు క్రియేట్ అయ్యాయి. ఇక ఈ సినిమాలో ‘బింబిసారా’ పాత్రలో పవర్‌ఫుల్ పర్ఫార్మెన్స్‌తో ప్రేక్షకులను అలరించేందుకు కళ్యాణ్ రామ్ రెడీ అయ్యాడు.

Bimbisara: విజువల్‌గా ఆకట్టుకుంటోన్న ‘ఓ తేనె పలుకుల’ సాంగ్

ఇక ఇప్పటికే ఈ చిత్ర పోస్టర్స్, టీజర్స్, సాంగ్స్, ట్రైలర్ ప్రేక్షకుల్లో ఈ సినిమాపై భారీ అంచనాలను క్రియేట్ అయ్యేలా చేశాయి. విజువల్ పరంగా కూడా బింబిసారా మూవీ ప్రేక్షకులను కట్టిపడేసేందుకు రెడీ అయ్యింది. అయితే తాజాగా ఈ సినిమాకు సంబంధించిన రిలీజ్ ట్రైలర్‌ను యంగ్ టైగర్ ఎన్టీఆర్ రిలీజ్ చేశారు. ఈ ట్రైలర్ చూస్తుంటే బింబిసారా పాత్రలో కళ్యాణ్ రామ్ ప్రాణం పెట్టి నటించినట్లుగా కనిపిస్తున్నాడు. ఇక టైమ్ ట్రావెల్ కాన్సెప్ట్‌ను ఈ సినిమాలో అత్యద్భుతంగా వాడుకోవడంతో ‘బింబిసారా’ ట్రైలర్ ప్రేక్షకులను కట్టిపడేసింది. అటు కళ్యాణ్ రామ్ బింబిసారా పాత్రలో పవర్‌ఫుల్ పర్ఫార్మెన్స్ ఇచ్చినట్లుగా ఈ ట్రైలర్ చేస్తే అర్థమవుతోంది.

Bimbisara: బింబిసారా కోసం రాజు గారి ఎంట్రీ!

కాగా, ఈ సినిమాలో భారీ వీఎఫ్ఎక్స్‌ను వినియోగించినట్లుగా ఈ ట్రైలర్‌లో మనకు శాంపిల్ చూపించారు. ఇక ‘బింబిసారా’ పాత్రలో కళ్యాణ్ రామ్ చెప్పే పవర్‌ఫుల్ డైలాగులు ఈ సినిమాకే హైలైట్‌గా నిలవబోతున్నట్లుగా తెలుస్తోంది. దర్శకుడు వశిష్ట ఈ సినిమాను గ్రాండియర్‌గా తెరకెక్కించగా, కళ్యాణ్ రామ్ ఈ సినిమాకు అత్యంత భారీ బడ్జెట్‌ను కేటాయించడం విశేషం. ఇక ఈ సినిమాలో అందాల భామలు కేథరిన్ త్రేజా, సంయుక్తా మీనన్‌లు హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఆగస్టు 5న ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమాను భారీ ఎత్తున రిలీజ్ చేసేందుకు కళ్యాణ్ రామ్ అండ్ టీమ్ రెడీ అవుతోంది. మరి ఈ బింబిసారుడు ఎలాంటి విజయాన్ని అందుకుంటాడో చూడాలి.