Vasanth Kokila : బాబీ సింహ, ఆర్య కలిసి థ్రిల్లింగ్ కథతో వస్తోన్న వసంత కోకిల ట్రైలర్ రిలీజ్.. మెగాస్టార్ చేతుల మీదుగా..

 మధుర ఫిలిమ్‌ ఫ్యాక్టరీ, ఎస్‌ఆర్‌టీ ఎంటర్‌టైన్ మెంట్స్ బ్యానర్లపై జాతీయ అవార్డు గ్రహీత, విలక్షణ నటుడు బాబీ సింహా హీరోగా రమణన్‌ దర్శకత్వం వహిస్తున్న చిత్రం `వసంత కోకిల`. ఇందులో బాబీ సింహా సరసన కాశ్మీర హీరోయిన్‌గా నటిస్తుంది. నలభై ఏళ్ల క్రితం...........

Vasanth Kokila : బాబీ సింహ, ఆర్య కలిసి థ్రిల్లింగ్ కథతో వస్తోన్న వసంత కోకిల ట్రైలర్ రిలీజ్.. మెగాస్టార్ చేతుల మీదుగా..

Bobby Simha Vasantha Kokila Movie trailer released

Vasanth Kokila :  మధుర ఫిలిమ్‌ ఫ్యాక్టరీ, ఎస్‌ఆర్‌టీ ఎంటర్‌టైన్ మెంట్స్ బ్యానర్లపై జాతీయ అవార్డు గ్రహీత, విలక్షణ నటుడు బాబీ సింహా హీరోగా రమణన్‌ దర్శకత్వం వహిస్తున్న చిత్రం `వసంత కోకిల`. ఇందులో బాబీ సింహా సరసన కాశ్మీర హీరోయిన్‌గా నటిస్తుంది. నలభై ఏళ్ల క్రితం కమల్‌ హాసన్‌, శ్రీదేవి నటించిన సూపర్‌ హిట్‌ టైటిల్‌ `వసంతకోకిల` తో ఈ సినిమా రూపొందుతుండటంతో ఆసక్తి నెలకొంది. మలయాళంలో వసంత ముల్లై అనే టైటిల్ తో వస్తున్న సినిమా తెలుగులో వసంత కోకిల పేరుతో డబ్బింగ్ రిలీజ్ అవ్వభితుంది.

ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్‌, సాంగ్స్ ఆడియెన్స్ ని బాగా ఆకట్టుకున్నాయి. ఈ సినిమా తెలుగు ట్రైలర్ ను మెగాస్టార్ చిరంజీవి రీలిజ్ చేసారు. కన్నడ ట్రైలర్‌ను స్టార్ హీరో శివరాజ్‌ కుమార్ లాంచ్‌ చేశారు. ఇటీవలే బాబీ సింహ వాల్తేరు వీరయ్య సినిమాలో విలన్ గా మెప్పించారు. దీంతో బాబీ సింహకి ప్రమోషన్స్ లో సపోర్ట్ చేస్తున్నారు మెగాస్టార్. అలాగే ఈ సినిమాలో ఆర్య కూడా ఓ ముఖ్య పాత్ర చేస్తున్నారు.

Sai Rajesh : పవన్ కి మంచి చేయకపోయినా పర్లేదు, చెడు చేయకండి.. పవన్ అభిమానులకు డైరెక్టర్ లేఖ..

ట్రైలర్ మొదటి నుండి చివరివరకు మంచి ఆసక్తికరంగా కట్ చేసారు. బాబీ సింహా-కశ్మీర పరదేశీ లవ్‌ ట్రాక్‌ తో పాటు వారి చుట్టూ జరిగి సస్పెన్స్ ఎలిమెంట్స్ తో సినిమా సాగనుందని తెలుస్తుంది. హీరో, హీరోయిన్ ఇద్దరూ కలిసి వెకేషన్ కి వెళ్లగా ఓ పాత హోటల్ లో దిగితే అక్కడ వీరికి ఎదురయ్యే పరిస్థితులు ఏంటి అన్నట్టు ట్రైలర్ లో చూపించారు. మిస్టరీ థ్రిల్లర్‌ జోనర్‌లో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో బాబీ సింహా రుద్ర పాత్రలో కనిపించనున్నాడు. ప్రముఖ నటుడు ఆర్య కూడా ఈ సినిమాలో కీలక పాత్రలో కనిపించనున్నాడు. ట్రైలర్ లో రాజేష్ మురుగేషన్ అద్భుతమైన బాక్గ్రౌండ్ స్కోర్ తో ఆసక్తిని పెంచాడు. ఈ వసంత కోకిల చిత్రం తెలుగు, తమిళం, కన్నడ భాషల్లో ఫిబ్రవరి 10న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో గ్రాండ్‌గా విడుదల కానుంది.