Adipurush : ఆదిపురుష్ మూవీతో బాలీవుడ్‌కి భయం పుడుతుందా.. ఎందుకో తెలుసా?

ప్రభాస్ ఆదిపురుష్ తో బాలీవుడ్‌కి భయం పుడుతుంది అనే కామెంట్స్ నెట్టింట వినిబడుతున్నాయి. హిందీ బాక్స్ ఆఫీస్ వద్ద మొన్నటి వరకు బాహుబలి 2 ఇండస్ట్రీ హిట్టుగా నిలిచింది. అయితే..

Adipurush : ఆదిపురుష్ మూవీతో బాలీవుడ్‌కి భయం పుడుతుందా.. ఎందుకో తెలుసా?

Bollywood scared about Prabhas Adipurush movie what is the reason

Prabhas Adipurush : ప్రభాస్ నటిస్తున్న ఆదిపురుష్ సినిమా సందడి మొదలైంది. ఈరోజు (జూన్ 6) తిరుపతిలో ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ ఘనంగా జరగబోతుంది. ఇక అన్ని సినిమా ఈవెంట్స్ లా కాకుండా, ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ ని ప్రత్యేకంగా చేసేలా ప్లాన్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే హనుమాన్ మూవీ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ.. ఈ ఈవెంట్ డిజైన్ చేస్తున్నాడు. ఇక ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ కు చినజీయర్ స్వామి ముఖ్య అతిథిగా రాబోతున్నారు.

Indian 2 : కమల్ హాసన్ ఇండియన్ 2 లో మెయిన్ విలన్ ఎవరో తెలుసా?

కాగా ఆదిపురుష్ సినిమాతో బాలీవుడ్‌కి భయం పుడుతుంది అనే కామెంట్స్ నెట్టింట వినిబడుతున్నాయి. హిందీ బాక్స్ ఆఫీస్ వద్ద మొన్నటి వరకు బాహుబలి 2 ఇండస్ట్రీ హిట్టుగా నిలిచింది. అయితే ఇటీవల షారుఖ్ ఖాన్ (Shah Rukh Khan) నటించిన పఠాన్ (Pathaan) బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకొని భారీ కలెక్షన్స్ సాధించడంతో బాహుబలిని వెనక్కి నెట్టి ఇండస్ట్రీ హిట్ స్థానాన్ని దక్కించుకుంది. అయితే ఇప్పుడు ఆ స్థానంలో పఠాన్ సినిమా ఎక్కువ కాలం నిలిచేలా కనిపించడం లేదు. ఆదిపురుష్ సినిమాకి సౌత్ లో కంటే నార్త్ లోనే ఎక్కువ క్రేజ్ ఉంది.

Sharwanand – Siddharth : శర్వానంద్ పెళ్లిలో సిద్దార్థ్ మ్యూజికల్ కాన్సర్ట్.. వీడియో వైరల్!

రామాయణ కథ కావడంతో అక్కడి ఆడియన్స్ ఆదిపురుష్ పై చాలా ఎక్కువ ఆసక్తి చూపిస్తున్నారు. ఈ మూవీ ప్రీ రిలీజ్ బిజినెస్ కూడా భారీ ధరకు అమ్ముడుపోయినట్లు తెలుస్తుంది. ఇక ఈ మూవీకి చిన్న పాజిటివ్ టాక్ వచ్చినా చాలు.. బాలీవుడ్ బాక్స్ ఆఫీస్ వద్ద పఠాన్ రికార్డు గల్లంతు అవ్వడం ఖాయం అంటున్నారు. మరి ఆదిపురుష్ ఎటువంటి రిజల్ట్ ని అందుకుంటుందో చూడాలి. కాగా ఈ సినిమాలో ప్రభాస్ (Prabhas) రాముడిగా, కృతి సనన్ (Kriti Sanon) సీతగా, సైఫ్ అలీఖాన్ (Saif Alikhan) రావణాసురుడిగా కనిపించబోతున్నారు. ఓం రౌత్ (Om Raut) దర్శకత్వం వహించిన ఈ చిత్రం జూన్ 16న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ గా రిలీజ్ కాబోతుంది.