Bollywood Strikes Back: తిరుగుబాటు మొదలైంది.. బడా బాబులందరూ ఏకమయ్యారు..

  • Edited By: sekhar , October 12, 2020 / 07:25 PM IST
Bollywood Strikes Back: తిరుగుబాటు మొదలైంది.. బడా బాబులందరూ ఏకమయ్యారు..

Bollywood Strikes Back: యువ నటుడు సుశాంత్‌ సింగ్‌ రాజ్‌పుత్‌ ఆత్మహత్య తర్వాత బాలీవుడ్‌ ఇండస్ట్రీలో వాతావరణం వేడెక్కింది. ఈ విషయంలో నెపోటిజం అనే అంశం తెరపైకి వచ్చింది.

అది కాస్తా డ్రగ్స్‌ కేసుకు దారితీసింది. నెపోటిజంపై స్టార్ కిడ్స్ ను సోషల్ మీడియాలో ఏకిపారేశారు నెటిజన్స్. డ్రగ్స్ కేసులో ఎప్పుడు ఎవరి పేరు బయటకొస్తుందోనని బడా బాబులకు చెమటలు పట్టాయి. ఇంతలో నటి పాయల్‌ ఘోష్‌ డైరెక్టర్ అనురాగ్ కశ్యప మీద MeToo ఆరోపణలు చేయడంతో రచ్చ మరింత పెరిగింది..


అయితే ఇంత జరుగుతున్నా.. ఒక్క అక్షయ్‌ కుమార్‌ తప్ప.. వేరే ఎవరూ నోరు మెదపలేదు. అంతా ఇక బాలీవుడ్‌ పని అయిపోయినట్లేరా అబ్బాయ్.. అనుకుంటున్న సమయంలో.. బాలీవుడ్‌లో తిరుగుబాటు మొదలైనట్లుగా వార్తలు వస్తున్నాయి. తాజాగా ప్రముఖ ఫిలిం క్రిటిక్ తరుణ్‌ ఆదర్శ్‌ చేసిన ట్వీట్‌ చూస్తుంటే.. ఇప్పటికే పరువు పోయి పడిపోతున్న బాలీవుడ్‌ పేరును నిలబెట్టేందుకు హిందీ చిత్రసీమ ప్రముఖులందరూ ఇప్పుడు ఏకమయ్యారు.


ఈ మేరకు బాలీవుడ్‌లోని నాలుగు అసోషియేషన్స్‌, 34 బడా నిర్మాణ సంస్థలు కలిసి బాలీవుడ్‌పై కథనాలు వెలువడిస్తున్న మీడియా సంస్థలపై దావా వేసేందుకు సిద్ధమవుతున్నట్లుగా తరుణ్‌ ఆదర్శ్‌ ట్వీట్‌ చేశారు. అయితే ఇప్పటి వరకు సైలెంట్‌గా ఉన్న వీరంతా.. సడెన్‌గా ఇలాంటి నిర్ణయం తీసుకోవడం వెనుక కారణం ఏదైనా ఉందా? అనేది వారికే తెలియాలి.

ధర్మ ప్రొడక్షన్స్ మొదలుకుని అనిల్ కపూర్, బోని కపూర్, షారుఖ్ ఖాన్, ఆమీర్ ఖాన్, సల్మాన్ ఖాన్, అజయ్ దేవ్‌గన్ వంటి పలు బడా నిర్మాణ సంస్థలు ఈ లిస్టులో ఉన్నాయి.

 

Bollywood

Bollywood