ష‌క‌ల‌క‌ శంక‌ర్ ‘‘బొమ్మ అదిరింది – దిమ్మ తిరిగింది’’

  • Published By: sekhar ,Published On : December 2, 2020 / 12:21 PM IST
ష‌క‌ల‌క‌ శంక‌ర్ ‘‘బొమ్మ అదిరింది – దిమ్మ తిరిగింది’’

Bomma Adirindi Dimma Thirigindi: ష‌క‌ల‌క‌ శంక‌ర్ హీరోగా నటిస్తున్న‘‘బొమ్మ అదిరింది – దిమ్మ తిరిగింది’’ మూవీ టీజ‌ర్ హ్యాపెనింగ్ బ్యూటీ ప్ర‌గ్యా జైస్వాల్ చేతుల మీదుగా విడుద‌ల‌ైంది. మ‌హంకాళి మూవీస్, మ‌హంకాళి దివాక‌ర్ స‌మ‌ర్ప‌ణ‌లో, మ‌ణిదీప్ ఎంట‌ర్‌టైన్మెంట్స్ ప‌తాకంపై లుకాల‌పు మ‌ధు, సోమేశ్ ముచ‌ర్ల నిర్మాత‌లుగా దత్తి సురేష్ బాబు నిర్మాణ నిర్వహణలో రూపొందుతున్న రొమాంటిక్ హార‌ర్ కామెడీ ఎంట‌ర్‌టైన‌ర్ ‘‘బొమ్మ అదిరింది – దిమ్మ తిరిగింది’’..

Pragya Jaiswal

నూత‌న ద‌ర్శ‌కుడు కుమార్ కోట ఈ సినిమాను తెర‌కెక్కిస్తున్నారు. ప్ర‌‌ముఖ స్టార్ హీరోయిన్, హ్యాపెనింగ్ బ్యూటీ ప్ర‌గ్యాజైస్వాల్ ఈ టీజ‌ర్ రిలీజ్ చేసి, టీమ్‌కి శుభాకాంక్ష‌లు తెలిపారు. ప్ర‌స్తుతం పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ ప‌నులు జ‌రుగుతున్నాయ‌ని నిర్మాతలు లుకాలపు మధు, సోమేశ్ ముచ‌ర్ల తెలిపారు.


ష‌క‌ల‌క శంక‌ర్ మార్క్ కామెడీతో పాటు యూత్‌ని ఆక‌ట్టుకునే అన్ని అంశాల‌తో అన్ని వ‌ర్గాలు ప్రేక్ష‌కుల్ని అల‌రించే రీతిలో రూపొందిస్తున్న‌ట్లుగా ద‌ర్శ‌కుడు కుమార్ కోట తెలిపారు. డిసెంబ‌ర్ నెలాఖ‌రులో ఈ అవుట్ అండ్ అవుట్ రొమాంటిక్ హార‌ర్ కామెడీ మూవీని ప్రేక్ష‌కుల ముందుకు తీసుకువ‌స్తున్నట్లుగా ద‌ర్శ‌క‌ నిర్మాత‌లు ప్ర‌క‌టించారు.

నటీనటులు
షకలక శంకర్
ప్రియ
అర్జున్ కళ్యాణ్
రాజ్ స్వరూప్
మధు
స్వాతి
అవంతిక
హీనా
రితిక చక్రవర్తి
సంజన చౌదరి

సాంకేతిక వర్గం
సమర్పణ : మహంకాళి మూవీస్, మహంకాళి దివాకర్
బ్యానర్ : మణిదీప్ ఎంటర్టైన్మెంట్స్
నిర్మాతలు : లుకాలపు మధు, సోమేశ్ ముచ్చర్ల
నిర్మాణ నిర్వాహణ : దత్తి సురేష్ బాబు
పీఆర్ఓ : మేఘశ్యామ్, లక్ష్మీ నివాస్
కెమెరామెన్ : ఫణింద్ర వర్మ అల్లూరి
మ్యూజిక్ : పిఆర్
స్టోరీ, డైలాగ్స్ : విఎస్ రావ్
డైరెక్టర్ : కుమార్ కోట.