Brahmastra: బ్రహ్మాండంగా మొదలైన బ్రహ్మాస్త్ర అడ్వాన్స్ బుకింగ్స్!

బాలీవుడ్ ప్రెస్టీజియస్ మూవీగా తెరకెక్కిన బ్రహ్మాస్త్రం ప్రస్తుతం ఇండియా వైడ్‌గా టాక్ ఆఫ్ ది నేషన్‌గా మారింది. ఈ సినిమా ప్రీరిలీజ్ ఈవెంట్‌ను హైదరాబాద్‌లో అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు చిత్ర యూనిట్ భారీ ప్లాన్ చేసింది. కానీ, తెలంగాణ సర్కార్ వారి ఆశలపై నీళ్లు జల్లింది. దీంతో ఈ సినిమా చుట్టూ రాజకీయ వివాదానికి తెరలేపారు.

Brahmastra: బ్రహ్మాండంగా మొదలైన బ్రహ్మాస్త్ర అడ్వాన్స్ బుకింగ్స్!

Brahmastra Advance Bookings Open To A Solid Start

Brahmastra: బాలీవుడ్ ప్రెస్టీజియస్ మూవీగా తెరకెక్కిన బ్రహ్మాస్త్రం ప్రస్తుతం ఇండియా వైడ్‌గా టాక్ ఆఫ్ ది నేషన్‌గా మారింది. ఈ సినిమా ప్రీరిలీజ్ ఈవెంట్‌ను హైదరాబాద్‌లో అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు చిత్ర యూనిట్ భారీ ప్లాన్ చేసింది. కానీ, తెలంగాణ సర్కార్ వారి ఆశలపై నీళ్లు జల్లింది. దీంతో ఈ సినిమా చుట్టూ రాజకీయ వివాదానికి తెరలేపారు.

Brahmastra Pre Release Event : బ్రహ్మాస్త్ర ప్రీ రిలీజ్ ఈవెంట్ రద్దు.. నష్టం ఎన్ని కోట్లో తెలుసా??

అయితే ఈ సినిమా ప్రీరిలీజ్ ఈవెంట్‌ను చివరి నిమిషంలో క్యాన్సిల్ చేయాల్సి వచ్చిందని.. అయినా మంచి సినిమాను ప్రేక్షకులు ఎప్పటికీ ఆదరిస్తారని చిత్ర యూనిట్ ధీమాగా చెబుతూ వచ్చింది. దీంతో ఈ సినిమా అడ్వాన్స్ బుకింగ్స్‌ను చిత్ర యూనిట్ ప్రారంభించింది. ఈ క్రమంలోనే బ్రహ్మాస్త్ర చిత్రానికి బ్రహ్మాండమైన ఓపెనింగ్స్ దక్కుతున్నట్లు అడ్వాన్స్ టికెట్ బుకింగ్స్ చూస్తే అర్థమవుతోంది. ఈ సినిమాను చూసేందుకు ఆడియెన్స్ ఆసక్తిని కనబరుస్తుండటంతో బ్రహ్మాస్త్ర చిత్రం బాక్సాఫీస్ వద్ద రిలీజ్‌కు ముందే వండర్స్ క్రియేట్ చేస్తోంది.

Brahmastra Pre-Release Event: బ్రహ్మాస్త్రంకు పొలిటికల్ టచ్.. అందుకే వాయిదా..?

ఈ సినిమా అడ్వాన్స్ బుకింగ్స్‌ను సెప్టెంబర్ 2న సెలెక్టివ్ ప్లేసెస్‌లో రిలీజ్ చేయగా, ఇప్పటికే ఏకంగా 11500 టికెట్లు అమ్ముడైనట్లు తెలుస్తోంది. గతకొంత కాలంగా వెనుకబడిపోయిన బాలీవుడ్‌కు ఇది ఊరటనిచ్చే విషయమనే చెప్పాలి. ఇక రాబోయే రోజుల్లో ఈ సినిమాకు థియేటర్ల సంఖ్య పెరగడం ఖాయమని.. తద్వారా అడ్వాన్స్ బుకింగ్స్ కూడా పెరగడం ఖాయమని చిత్ర వర్గాలు అంటున్నాయి. అయాన్ ముఖర్జీ తెరకెక్కిస్తున్న ఈ సూపర్ మూవీని రెండు భాగాలుగా రిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్ రెడీ అయ్యింది. ఇక ఈ సినిమాలో రణ్‌బీర్ కపూర్, ఆలియా భట్ జంటగా నటిస్తుండగా, అమితాబ్ బచ్చన్, నాగార్జున తదితరులు ఇతర మఖ్య పాత్రల్లో నటిస్తున్నారు.