ఆకాశంలో ‘బ్రహ్మాస్త్ర’.. కింగ్ నాగ్ కీలకపాత్రలో!

  • Published By: vamsi ,Published On : March 4, 2019 / 03:14 PM IST
ఆకాశంలో ‘బ్రహ్మాస్త్ర’.. కింగ్ నాగ్ కీలకపాత్రలో!

బిగ్‌బీ అమితాబ్‌ బచ్చన్‌, రణ్‌బీర్‌కపూర్‌, అలియాభట్‌ వంటి స్టార్ క్యాస్టింగ్ తో బాలీవుడ్ లో తెరకెక్కుతున్న సినిమా ‘బ్రహ్మాస్త్ర’. టాలీవుడ్‌ కింగ్‌ నాగార్జున ఈ మూవీలో ఓ కీలకపాత్రలో నటిస్తుండగా.. ఈ సినిమాకు సంబంధించిన లోగోను తాజాగా చిత్రయూనిట్‌ విడుదల చేసింది. ఈ మూవీ లోగోను ప్రయాగ వద్ద  జరుగుతున్న కుంభమేళాలో చిత్రయూనిట్ ఆవిష్కరించారు. డ్రోన్లను అమర్చి ఆకాశంలో బ్రహ్మాస్త్ర లోగోను రివీల్‌ చేయడం అక్కడ అందరినీ ఆశ్యర్యపరిచింది. పూజా కార్యక్రమాలను నిర్వహించిన అనంతరం లోగోను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో రణ్‌బీర్‌ కపూర్‌, అలియా భట్‌, అయాన్‌ ముఖర్జీ పాల్గొన్నారు. ధర్మ మూవీస్‌పై కరణ్‌ జోహార్‌ నిర్మిస్తున్న ఈ సినిమాకకు ‘ఏ జవానీ హై దీవానీ’ ఫేమ్‌ అయాన్‌ ముఖర్జీ దర్శకత్వం వహిస్తున్నారు.