Bunty Aur Babli 2 : ఈసారి ఎంటర్‌టైన్‌మెంట్ డోస్ డబుల్..

సైఫ్ అలీ ఖాన్, రాణీ ముఖర్జీ జంటగా నటిస్తున్న ‘బంటీ ఔర్ బబ్లీ 2’ టీజర్‌కి మంచి రెస్పాన్స్ వస్తోంది..

10TV Telugu News

Bunty Aur Babli 2: సెకండ్ వేవ్ తర్వాత బాలీవుడ్‌లో కొత్త సినిమాల రిలీజుల హంగామా స్టార్ట్ అయ్యింది. 2005లో బిగ్‌బి అమితాబ్ బచ్చన్, అభిషేక్ బచ్చన్, రాణీ ముఖర్జీ ప్రధాన పాత్రల్లో నటించగా సూపర్ హిట్ అయిన ‘బంటీ ఔర్ బబ్లీ’ కి సీక్వెల్‌గా ‘బంటీ ఔర్ బబ్లీ 2’ (Bunty Aur Babli 2) రూపొందుతున్న సంగతి తెలిసిందే.

Prabhas : ప్రభాస్ బిర్యానీకి బాలీవుడ్ భామ ఫిదా..

సైఫ్ అలీ ఖాన్, రాణీ ముఖర్జీ జంటగా నటించగా వరుణ్ వి.శర్మ డైరెక్ట్ చేశారు. ప్రముఖ నిర్మాణ సంస్థ యష్ రాజ్ ఫిల్మ్స్ బ్యానర్ మీద ఆదిత్య చోప్రా నిర్మించారు. ఈ సీక్వెల్‌లో సైఫ్, రాణీలతో పాటు మరో యువ జంట సిద్ధాంత్ చతుర్వేది, షర్వారీ కూడా నటించారు.

Bollywood Films : ‘పుష్ప’ తో సహా రిలీజ్ డేట్స్ లాక్ చేసుకున్న పది సినిమాలు..

శుక్రవారం ‘బంటీ ఔర్ బబ్లీ 2’ టీజర్ రిలీజ్ చేశారు. దాదాపు 12 సంవత్సరాల తర్వాత కలిసి పని చేస్తున్నాం. ఇన్నాళ్లూ ఒకరినొకరం మిస్ అయ్యామని సైఫ్, రాణీ అనుకుంటూ ఉండగా.. మధ్యలో సిద్ధాంత్, షర్వారీ రావడం.. ‘బంటీ, బబ్లీ’ గా పరిచయం చేసుకోవడం.. మీరు ‘బంటీ, బబ్లీ’ అయితే మేమెవరం అని సీరియస్ అవడం.. డైరెక్టర్ సార్ స్క్రిప్ట్‌లో మార్పులు చేశారని చెప్పడం.. రాణీ ముఖర్జీ, నిర్మాతను తన మేకప్ రూంకి పిలవమని, సైఫ్, డైరెక్టర్‌ని తన మేకప్ రూంకి రమ్మనడం.. ఇలా ఫన్నీగా ఉంది ‘బంటీ ఔర్ బబ్లీ 2’ టీజర్. నవంబర్ 19న సినిమా రిలీజ్ కానుంది.