Director Vassishta: వారసుల కోసం కథలు.. తండ్రులతో సినిమాలు.. లక్ అంటే వశిష్ఠదే!
Vishwambhara Director Vassishta: మోక్షజ్ఞ కోసం కథను సిద్ధం చేసి బాలకృష్ణతో సినిమా చేస్తున్న దర్శకుడు వశిష్ట(Vassishta).
Vishwambhara Director Vassishta next movie with balakrishna
- వశిష్ట కెరీర్లో విచిత్రమైన కోఇన్సిడెన్స్
- కొడుకు కోసం వెళ్లి తండ్రిని పట్టేసిన డైరెక్టర్
- మోక్షజ్ఞ కథ పక్కన పెట్టి బాలయ్యతో సినిమా
Director Vassishta: నిజంగా లక్ అంటే దర్శకుడు వశిష్టదే అని చెప్పాలి. బింబిసారా హిట్ తరువాత ఈ దర్శకుడు మెగాస్టార్ చిరంజీవితో విశ్వంభర సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. త్వరలోనే ఈ సినిమా కూడా ప్రేక్షకుల ముందుకు రానుంది. అయితే, విశ్వంభర తరువాత వశిష్ట నందమూరి వారసుడు మోక్షజ్ఞ అరంగేట్రం కోసం ఒక అద్భుతమైన కథను సిద్ధం చేసి వినిపించడం కూడా జరిగిందట. అయితే, ఈ కథ చెప్తున్న సమయంలోనే బాలకృష్ణకు మరో కథను వివరించాడట వశిష్ట. అయితే, ఆ కథ బాలకృష్ణకు బాగా నచ్చిందట. దీంతో, మోక్షజ్ఞ ప్రాజెక్టును పక్కన పట్టి బాలయ్య సినిమా పట్టాలెక్కే అవకాశాలు కనిపిస్తున్నాయి.
*రామ్ చరణ్ ‘పెద్ది’ మరోసారి వాయిదా.. రెహమాన్ మ్యూజికే కారణమట
అలా, కొడుకు కోసం వెళితే తండ్రి ప్రాజెక్ట్ ఓకే అవ్వడం ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. ఇదే తరహా సంఘటన గతంలో ‘విశ్వంభర’ విషయంలోనూ జరిగింది. దర్శకుడు వశిష్ట (Vassishta)ముందు రామ్ చరణ్ కోసం ఒక భారీ సోషియో ఫాంటసీ కథను రాసుకున్నారు. చరణ్‌కు ఆ కథ నచ్చినప్పటికీ, చర్చల దశలో మెగాస్టార్ చిరంజీవికి మరో లైన్ వినిపించడం జరిగింది. అదే విశ్వంభర. ఆ కథ చిరుకి బాగా నచ్చడంతో ‘విశ్వంభర’గా రూపుదిద్దుకోవడం జరిగిపోయాయి. అలా రామ్ చరణ్ ప్రాజెక్ట్ కాస్తా చిరంజీవి ఖాతాలోకి వెళ్ళిపోయింది.
నిజానికి, వశిష్ట మేకింగ్ స్టైల్, విజన్ సీనియర్ స్టార్ హీరోలను అమితంగా ఆకట్టుకుంటున్నాయి. ఆయన రాసుకున్న కథలు యంగ్ హీరోల కంటే సీనియర్ స్టార్ హీరోల ఇమేజ్‌కు, వారి మార్కెట్‌కు సరిగ్గా సరిపోతున్నాయి. అందుకే వరుసగా ఇద్దరు మెగాస్టార్, నందమూరి వారసుల కోసం అనుకున్న కథలు చివరకు వారి తండ్రులైన చిరంజీవి, బాలకృష్ణల వద్దకు చేరుతున్నాయి. ఈ అరుదైన కోఇన్సిడెన్స్ వశిష్ట కెరీర్లో ఒక ప్రత్యేకమైన మలుపుగా మారింది. త్వరలోనే బాలయ్య-వశిష్ట కాంబినేషన్‌పై అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉంది.
