Kushi: ఆగకుండా వెళ్తానంటోన్న ఖుషి.. రిలీజ్ కోసమేనా?

రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ ఇటీవల లైగర్ మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ సినిమా రిలీజ్ కాకముందే, తన నెక్ట్స్ ప్రాజెక్టును పట్టాలెక్కించాడు ఈ క్రేజీ స్టార్. దర్శకుడు శివ నిర్వాణ దర్శకత్వంలో స్టార్ బ్యూటీ సమంతతో కలిసి ‘ఖుషి’ అనే సినిమాను స్టార్ట్ చేశాడు విజయ్. ఈ సినిమాకు సంబంధించి రిలీజ్ విషయంలో ఓ ఇంట్రెస్టింగ్ వార్త ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తోంది.

Kushi: ఆగకుండా వెళ్తానంటోన్న ఖుషి.. రిలీజ్ కోసమేనా?

Buzz On Vijay Devarakonda Samantha Kushi Release

Kushi: రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ ఇటీవల లైగర్ మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ సినిమా రిలీజ్ కాకముందే, తన నెక్ట్స్ ప్రాజెక్టును పట్టాలెక్కించాడు ఈ క్రేజీ స్టార్. దర్శకుడు శివ నిర్వాణ దర్శకత్వంలో స్టార్ బ్యూటీ సమంతతో కలిసి ‘ఖుషి’ అనే సినిమాను స్టార్ట్ చేశాడు విజయ్. ఈ సినిమా షూటింగ్ కూడా జరుపుకుంటోంది. ఇక ఇప్పుడు ఈ సినిమాకు సంబంధించి రిలీజ్ విషయంలో ఓ ఇంట్రెస్టింగ్ వార్త ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తోంది.

Kushi: సామ్‌తో విజయ్ ఖుషీ.. సౌత్‌కే పరిమితం చేస్తున్నారెందుకు?

ఔట్ అండ్ ఔట్ లవ్, యాక్షన్, రొమాంటిక్ ఎంటర్‌టైనర్ మూవీగా ఈ సినిమాను చిత్ర యూనిట్ తెరకెక్కిస్తుండగా, ఈ సినిమాను క్రిస్మస్ కానుకగా రిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్ ప్లాన్ చేస్తోంది. అయితే ఈ సినిమా నెక్ట్స్ షెడ్యూల్‌ను అక్టోబర్ రెండో వారంలో స్టార్ట్ చేసి, నిర్విరామంగా ఈ సినిమా షూటింగ్ పూర్తయ్యే వరకు చేయాలని చిత్ర యూనిట్ భావిస్తోందట. ఈ సినిమాను అనుకున్నదానికంటే ముందుగానే పూర్తి చేయాలని చిత్ర యూనిట్ డిసైడ్ అయినట్లు తెలుస్తోంది.

Kushi : పవన్ కళ్యాణ్ హిట్ టైటిల్‌తో సమంత, విజయ్ దేవరకొండ.. ఫ్యాన్స్ ఏమంటారో??

ఈ మేరకు సినిమాను డిసెంబర్ 23న రిలీజ్ చేయాలని.. ఈ సినిమాతో సాలిడ్ హిట్ కొట్టాలని హీరో విజయ్ దేవరకొండతో పాటు సమంత, శివ నిర్వాణ కూడా ఆశిస్తున్నట్లు చిత్ర వర్గాల్లో టాక్ వినిపిస్తోంది. ఇక ఈ సినిమాను తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో రిలీజ్ చేస్తుండగా, మైత్రీ మూవీ మేకర్స్ ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్‌తో ప్రొడ్యూస్ చేస్తున్నారు. మరి ఈ సినిమాను అనుకున్న సమయానికి రిలీజ్ చేస్తారా లేదా అనేది చూడాలి.