Bollywood Movies: ఈ వారం థియేటర్లలోకి అజయ్, టైగర్.. యష్ ముందు నిలబడగలరా?

బాలీవుడ్ లో గ్యాప్ తర్వాత క్రేజ్ ఉన్న సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. ఈ మధ్య కొన్ని సినిమాలు రిలీజ్ అయినా బాక్సాఫీస్ దగ్గర తుస్సుమన్నాయి. అయితే ఈ వీకెండ్ కి టైగర్ ష్రాఫ్, అజయ్ దేవ్ గన్ లాంటి యాక్షన్ హీరోల సినిమాలు రిలీజ్ అవుతున్నాయి.

Bollywood Movies: ఈ వారం థియేటర్లలోకి అజయ్, టైగర్.. యష్ ముందు నిలబడగలరా?

Bollywood Movies

Bollywood Movies: బాలీవుడ్ లో గ్యాప్ తర్వాత క్రేజ్ ఉన్న సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. ఈ మధ్య కొన్ని సినిమాలు రిలీజ్ అయినా బాక్సాఫీస్ దగ్గర తుస్సుమన్నాయి. అయితే ఈ వీకెండ్ కి టైగర్ ష్రాఫ్, అజయ్ దేవ్ గన్ లాంటి యాక్షన్ హీరోల సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. కానీ ఆల్రెడీ బాక్సాఫీస్ దగ్గర కెజిఎఫ్ రూపంలో యష్ అడ్డంగా నిలబడిపోయాడు. మరి ఈ హిందీ రిలీజ్ లు కెజిఎఫ్ స్పీడ్ కి బ్రేక్ వెయ్యగలవా..? అసలు కెజిఎఫ్ ముందు తట్టుకొని నిలబడగలవా..?

Bollywood Movies: బాలీవుడ్ కి చేతకావట్లేదా? సౌత్ ను చూసి నేర్చుకోవాల్సిందేనా?

బాలీవుడ్ యాక్షన్ లవర్స్ కి ఈ శుక్రవారం ఫీస్ట్ ఇవ్వబోతున్నారు మేకర్స్. బ్యాక్ టూ బ్యాక్ యాక్షన్ సినిమాల రిలీజ్ లతో రెడీ అవుతున్నాయి బాలీవుడ్ ధియేటర్లు. ఏప్రిల్ 29 ఈశుక్రవారం టైగర్ ష్రాఫ్ సూపర్ క్రేజీ సిరీస్ టైగర్ పన్తి 2తో పాటు అజయ్ దేవ్ గన్ రన్ వే 34 సినిమాలు చాలా కాలం తర్వాత ధియేటర్లోకి వస్తున్నాయి. అయితే.. ఆల్రెడీ బాలీవుడ్ లో బాక్సాఫీస్ దగ్గర దుమ్మురేపుతూ టైగర్ జిందా హే, పి.కె, సంజు లాంటి బ్లాక్ బస్టర్ సినిమాల కలెక్షన్లను క్రాస్ చేసిన కెజిఎఫ్ ముందు ఈరెండు సినిమాలు తట్టుకోగలవా అని డౌట్ పడుతున్నారు ఆడియన్స్.

Bollywood Movies: టార్గెట్ 2023.. వచ్చే ఏడాదే బాలీవుడ్ బిగ్ ప్రాజెక్ట్స్!

మాస్ యాక్షన్ హీరో అజయ్ దేవ్ గన్ సూర్యవన్షి సినిమా తర్వాత అవుట్ అండ్ అవుట్ డ్రామాగా తెరకెక్కిస్తున్న మూవీ రన్ వే 34. రకుల్ ప్రీత్ సింగ్, అజయ్ దేవ్ గన్, అమితాబ్ బచ్చన్ లీడ్ రోల్స్ లో తెరకెక్కిన ఈ ఫ్లైట్ డ్రామా ఏప్రిల్ 29న రిలీజ్ అవుతోంది. అసలే ట్రిపుల్ఆర్, గంగూభాయ్ లాంటి బ్లాక్ బస్టర్ సినిమాల్లో టాప్ క్యారెక్టర్లు చేసి బ్యాక్ టూ బ్యాక్ సక్సెస్ లో ఉన్న అజయ్ దేవ్ గన్ కి సూపర్ క్రేజ్ ఉంది. అయితే మరో వైపు ఇప్పటికే బాలీవుడ్ బాక్సాఫీస్ దగ్గర 350 కోట్ల కలెక్షన్లతో కెజిఎఫ్ ఇంకా అదే స్పీడ్ చూపిస్తోంది. మరి ఈ కెజిఎఫ్ స్పీడ్ ని రన్ వే ఎలా బ్రేక్ వేస్తుందో చూడాలి.

Bollywood Movies: బాలీవుడ్ మైండ్ బ్లాంక్.. సక్సెస్ ఫార్ములా మర్చిపోయిందా?

ఈ శుక్రవారం రిలీజ్ అవుతున్న మరో ఇంట్రస్టింగ్ బాలీవుడ్ మూవీ హీరోపన్తి 2. టైగర్ ష్రాఫ్ క్రేజీ యాక్షన్ ఎంటర్ టైనర్ హీరో పన్తికి సీక్వెల్ గా వస్తున్న హీరోపన్తి 2కి కూడా కెజిఎఫ్ అడ్డం పడేలానే కనిపిస్తున్నాడు. టైగర్ కి బాలీవుడ్ లో మంచి క్రేజ్ ఉన్నా.. మరో వైపు కెజిఎఫ్ 2 దూకుడు కూడా ఏమాత్రం తగ్గకపోయే సరికి డౌట్ ఎక్స్ ప్రెస్ చేస్తున్నారు. రెండు వారంలోకి ఎంట్రీ ఇచ్చాక కూడా శుక్రవారం 11, శనివారం 18, ఆదివారం 22, సోమవారం8, మంగళవారం 7, బుధవారం 6 కోట్లతో ఇంకా బాక్సాఫీస్ దగ్గర తనహవానడిపిస్తోంది. మరి ఈ శుక్రవారం మళ్లీ వీకెండ్ కాబట్టి.. కలెక్షన్లు పుంజుకునే ఛాన్స్ కనిపిస్తోంది. మరి ఇంకా తగ్గని కెజిఎఫ్ 2ని టైగర్ ఎలా ఫేస్ చేస్తాడో వెయిట్ చేసి చూడాల్సిందే.