చైనా అధ్యక్షుడు దంగల్ సినిమా చూశాడు…మోడీ

  • Published By: venkaiahnaidu ,Published On : October 15, 2019 / 01:18 PM IST
చైనా అధ్యక్షుడు దంగల్ సినిమా చూశాడు…మోడీ

పొగట్ సిస్టర్,వాళ్ల తండ్రి జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన “దంగల్” సినిమాను చైనా అధ్యక్షుడు జీ జిన్ పింగ్ చూశారని ప్రధానమంత్రి నరేంద్రమోడీ తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా అత్యధికంగా కలెక్షన్లు రాబట్టిన దంగల్ సినిమాలో ప్రముఖ రెజ్లర్ బబితా పొగట్,ఆమె చెల్లెలు పాత్రలో జైరా వాసిమ్,సుహీనీ భత్నాగర్ నటించగా,పొగట్ తండ్రి పాత్రలో అమీర్ ఖాన్ నటించిన విషయం తెలిసిందే.

ఇవాళ(అక్టోబర్-15,2019)హర్యానా అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న మోడీ మాట్లాడుతూ…గత వారం మహాబలిపురానికి వచ్చిన చైనా అధ్యక్షుడు..తాను దంగల్ సినిమా చూశానని చెప్పాడని మోడీ అన్నారు. జిన్ పింగ్ మాట విని తాను చాలా గర్వపడ్డానని మోడీ అన్నారు. మన అమ్మాయిలు అబ్బాయిలకంటే ఏ విధంగా తక్కువకాదని హర్యానా భాషలో మోడీ అన్నారు. బబితా పోగట్,ఆమె తండ్రి ఇటీవల బీజేపీలో చేరిన విషయం తెలిసిందే. హర్యానాలోని దాద్రీ స్థానం నుంచి బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా 29ఏళ్ల బబితా పొగట్ పోటీ చేస్తున్న విషయం తెలిసిందే.