Chiranjeevi : శివశంకర్ మాస్టర్ కన్నుమూత.. సినీ పరిశ్రమకు తీరని లోటు

శివశంకర్ మాస్టర్ మరణ వార్త నన్ను కలచి వేసింది. శివశంకర్ మాస్టర్ ఒక పక్క వ్యక్తిగతంగా, మరో పక్క వృత్తిపరంగా ఎన్నో సవాళ్లు అధిగమించి వందల సినిమాలకు కొరియోగ్రాఫర్ గా సేవలు అందించారు.

Chiranjeevi : శివశంకర్ మాస్టర్ కన్నుమూత.. సినీ పరిశ్రమకు తీరని లోటు

Chiranjeevi

Chiranjeevi : కరోనా బారిన పడ్డ ప్రముఖ కొరియోగ్రాఫర్ శివశంకర్ మాస్టర్ చికిత్స పొందుతూ ఆదివారం తుదిశ్వాస విడిచారు. ఆయన మృతి పట్ల మెగాస్టార్ చిరంజీవి సంతాపం తెలిపారు. ‘శివశంకర్ మాస్టర్ మరణ వార్త నన్ను కలచి వేసింది. శివశంకర్ మాస్టర్ ఒకపక్క వ్యక్తిగతంగా, మరోపక్క వృత్తిపరంగా ఎన్నో సవాళ్లు అధిగమించి వందల సినిమాలకు కొరియోగ్రాఫర్ గా సేవలు అందించారు. ఆయన నేను కలిసి ఎన్నో సినిమాలకు పని చేశాం. ముఖ్యంగా ఖైదీ సినిమాకు సలీం మాస్టర్ అసిస్టెంట్ గా నాకు చాలా స్టెప్స్ ఆయనే కంపోజ్ చేశారు.

అప్పుడు మొదలైన మా స్నేహం బలపడింది. తర్వాత కూడా ఎన్నో సినిమాలకు కలిసి పని చేశాం. చరణ్ బ్లాక్ బస్టర్ మగధీర సినిమాలోని ధీర ధీర పాటకు శి‌వశంకర్ మాస్టర్ జాతీయ అవార్డ్ కూడా పొందారు. ఆయనను చివరిగా ఆచార్య సెట్స్ లో కలిశాను. అదే చివరిసారి అవుతుందని అస్సలు ఊహించ లేదు. ఒక ఆత్మీయుడిని కోల్పోయినట్టు అనిపిస్తోంది. ఆయన మృతి కేవలం నృత్య కళా రంగానికే కాదు, యావత్ సినీ పరిశ్రమకే తీరని లోటు’ అని చిరంజీవి అన్నారు. శివశంకర్ మాస్టర్ తో తనకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్న చిరంజీవి ఆయన కుటుంబానికి సానుభూతి తెలిపారు.

Jr NTR Fans : ‘సీఎం ఎన్టీఆర్’.. కుప్పంలో ఫ్యాన్స్ నినాదాలు..

ఇటీవల కరోనా బారినపడిన శివశంకర్ మాస్టర్ ఏఐజీ ఆసుపత్రిలో చికిత్స పొందారు. ఆసుపత్రిలో చేరినప్పటి నుంచే ఆయన పరిస్థితి విషమంగా ఉందన్న వార్తలు వచ్చాయి. ఊపిరితిత్తులకు 75శాతం ఇన్ ఫెక్షన్ సోకింది. తమిళ హీరో ధనుష్, బాలీవుడ్ నటుడు సోనూ సూద్, టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి తదితరులు శివశంకర్ మాస్టర్ చికిత్స కోసం విరాళాలు కూడా అందజేశారు. అటు అభిమానులు, శ్రేయోభిలాషులు కూడా శివశంకర్ త్వరగా కోలుకోవాలని ప్రార్థించారు.

అయితే అందరినీ విషాదానికి గురిచేస్తూ శివశంకర్ మాస్టర్ ఆదివారం తుదిశ్వాస విడిచారు. శివశంకర్ మాస్టర్ పెద్ద కుమారుడు విజయ్ శివశంకర్ కూడా కరోనా బారినపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఆయన పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. శివశంకర్ మాస్టర్ భార్య కూడా కరోనా బారిన పడ్డారు. శివశంకర్ మాస్టర్ చిన్న కొడుకు వారి బాగోగులు చూసుకుంటున్నాడు.

శివశంకర్ మాస్టర్ వయసు 72 సంవత్సరాలు. 1975 నుంచి ఆయన సినీ రంగంలో కొనసాగుతున్నారు. తమిళ, తెలుగు చిత్రాలతో సహా 10 భాషల్లోని 800లకు పైగా చిత్రాల్లో పాటలకు ఆయన కొరియోగ్రఫీ చేశారు. అత్యధికంగా దక్షిణాది భాషా చిత్రాలకు పనిచేశారు. 1975లో ‘పాట్టు భరతమమ్‌’ చిత్రానికి సహాయకుడిగా కెరీర్‌ ప్రారంభించిన ఆయన ‘కురువికూడు’ చిత్రంతో నృత్య దర్శకుడిగా మారారు. కేవలం కొరియోగ్రాఫర్‌గానే కాదు, నటుడిగా వెండితెరపైనా
తనదైన ముద్రవేశారు. 2003లో వచ్చి ‘ఆలయ్‌ ’చిత్రంతో నటుడిగా మారిన శివ శంకర్‌ మాస్టర్‌ దాదాపు 30కి పైగా చిత్రాల్లో వైవిధ్య నటనతో నవ్వులు పంచారు.

Fridge : ఫ్రిజ్‌లో… ఆ.. ఆహార పదార్థాలను ఉంచకపోవటమే మేలు.. ఎందుకంటే?

టెలివిజన్ రంగంలోనూ తనదైన ముద్రవేశారు. పలు షోలకు న్యాయ నిర్ణేతగా వ్యవహరించారు. ఆయన దగ్గర శిష్యరికం చేసిన ఎంతో మంది ప్రస్తుతం టాప్‌ కొరియోగ్రాఫర్లుగా కొనసాగుతున్నారు. శివ శంకర్‌కు ఇద్దరు కుమారులు. విజయ్‌ శివ శంకర్‌, అజయ్‌ శివ శంకర్‌. ఇద్దరూ డ్యాన్స్‌ మాస్టర్లే.