Chiranjeevi: మెగా 154 పోస్టర్, టీజర్‌పై చిరు క్లారిటీ

మెగాస్టార్ చిరంజీవి నటించిన లేటెస్ట్ మూవీ ‘గాడ్ ఫాదర్’ బాక్సాఫీస్ వద్ద బ్లాక్‌బస్టర్ హిట్‌గా నిలవడంతో మెగా ఫ్యాన్స్ సంతోషంతో ఊగిపోతున్నారు. ఈ సినిమాలో మెగాస్టార్ సరికొత్త స్వాగ్‌కు వారు ఫిదా అవుతున్నారు. అభిమానులు, ప్రేక్షకులు ఇంకా గాడ్‌ఫాదర్ మేనియా నుండి బయటపడకముందే, చిరు మరో సర్‌ప్రైజ్‌ను రెడీ చేస్తున్నాడట. తాజాగా ఓ ఇంటర్వ్యూలో ముచ్చటించిన చిరు, ఈ మేరకు క్లారిటీ ఇచ్చాడు.

Chiranjeevi: మెగా 154 పోస్టర్, టీజర్‌పై చిరు క్లారిటీ

Chiranjeevi Gives Clarity On Mega 154 Poster And Teaser Release

Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవి నటించిన లేటెస్ట్ మూవీ ‘గాడ్ ఫాదర్’ బాక్సాఫీస్ వద్ద బ్లాక్‌బస్టర్ హిట్‌గా నిలవడంతో మెగా ఫ్యాన్స్ సంతోషంతో ఊగిపోతున్నారు. ఈ సినిమాలో మెగాస్టార్ సరికొత్త స్వాగ్‌కు వారు ఫిదా అవుతున్నారు. అభిమానులు, ప్రేక్షకులు ఇంకా గాడ్‌ఫాదర్ మేనియా నుండి బయటపడకముందే, చిరు మరో సర్‌ప్రైజ్‌ను రెడీ చేస్తున్నాడట. తాజాగా ఓ ఇంటర్వ్యూలో ముచ్చటించిన చిరు, ఈ మేరకు క్లారిటీ ఇచ్చాడు.

Chiranjeevi: నేను రాజకీయాల్లో కొనసాగి ఉంటే ఏపీకి మారేవాడిని.. చిరంజీవి!

యంగ్ డైరెక్టర్ బాబీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న మెగా 154 సినిమా ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. ఈ సినిమాకు సంబంధించిన టైటిల్ విషయంలో గతకొద్ది రోజులుగా ఇండస్ట్రీ వర్గాల్లో ఓ టాక్ జోరుగా వినిపిస్తోంది. ఈ సినిమాకు వాల్తేరు వీరయ్య అనే టైటిల్‌ను చిత్ర యూనిట్ ఫిక్స్ చేయబోతుందని సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ఇప్పుడు ఇదే నిజం కానుందట. ‘వాల్తేరు వీరయ్య’కు సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్, టీజర్‌ను దీపావళి కానుకగా రిలీజ్ చేయబోతున్నట్లు చిరు చెప్పుకొచ్చారు.

Chiranjeevi : ఎన్టీఆర్,సావిత్రి ఎలాగో నేను, నయనతార కూడా అంతే.. అందుకే ఇలా..

దీంతో మెగా ఫ్యాన్స్ ఈ సినిమా అప్డేట్ కోసం మరింత ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. పూర్తిగా మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా ఈ సినిమాను దర్శకుడు బాబీ తెరకెక్కిస్తుండటంతో ఈ సినిమాలో చిరు ఎలాంటి పర్ఫార్మెన్స్ ఇవ్వనున్నాడా అని అందరూ ఆసక్తిగా చూస్తున్నారు. ఇక ఈ సినిమాలో అందాల భామ శ్రుతి హాసన్ హీరోయిన్‌గా నటిస్తోండగా, మాస్ రాజా రవితేజ ఈ సినిమాలో ఓ కీలక పాత్రలో నటిస్తున్నాడు. మరి దీపావళికి మెగా ట్రీట్ ఎలా ఉండబోతుందో తెలియాలంటే పండగ వరకు వెయిట్ చేయాల్సిందే.