Amigos : కళ్యాణ్ రామ్‌తో పోటీకి దిగుతున్న చిరు..

ఫిబ్రవరి 10న ఎటువంటి పోటీ లేకుండా 'అమిగోస్' సినిమాతో బాక్స్ ఆఫీస్ బరిలోకి దిగుతున్నాడు కళ్యాణ్ రామ్. అయితే ఇప్పుడు మెగాస్టార్ చిరంజీవి నేను కూడా వస్తున్నా అంటూ అదే వీకెండ్ లో తన సినిమాని రిలీజ్ కి సిద్ధం చేస్తున్నాడు.

Amigos : కళ్యాణ్ రామ్‌తో పోటీకి దిగుతున్న చిరు..

kalyan ram chiranjeevi

Amigos : నందమూరి కళ్యాణ్ రామ్ నటిస్తున్న యాక్షన్ ఎంటర్టైనర్ చిత్రం ‘అమిగోస్’. ఈ సినిమాలో కళ్యాణ్ రామ్ మొదటిసారి త్రిపాత్రాభినయం చేస్తున్నాడు. మూడు డిఫరెంట్ రోల్స్ తో హీరో, విలన్ తానే అయ్యి నటిస్తున్నాడు. కొత్త దర్శకుడు రాజేంద్ర డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాలో ఆషికా రంగ‌నాథ్‌ కళ్యాణ్ రామ్ కి జంటగా నటిస్తుంది. వరుస విజయాలతో దూసుకుపోతున్న మైత్రి మూవీ మేకర్స్ ఈ సినిమాని నిర్మిస్తున్నారు. జిబ్రాన్ సంగీతం అందిస్తున్నాడు. ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజ్ అయిన ట్రైలర్ అండ్ సాంగ్స్ మూవీ పై అంచనాలు క్రియేట్ చేశాయి.

NTR : ఫ్యాన్స్ ధాటికి తట్టుకోలేకపోతున్న హీరోలు.. అందుకే ఎన్టీఆర్ సీరియస్ అయ్యాడా?

ఫిబ్రవరి 10న ఎటువంటి పోటీ లేకుండా బాక్స్ ఆఫీస్ బరిలోకి దిగుతున్నాడు కళ్యాణ్ రామ్. అయితే ఇప్పుడు మెగాస్టార్ చిరంజీవి నేను కూడా వస్తున్నా అంటూ అదే వీకెండ్ లో తన సినిమాని రిలీజ్ కి సిద్ధం చేస్తున్నాడు. మొన్ననే కదా వాల్తేరు వీరయ్య రిలీజ్ చేశాడు. ఇంక ఏ సినిమా రిలీజ్ కి ఉంది అని ఆలోచిస్తున్నారా? విడుదలకు సిద్దమవుతుంది చిరు కొత్త సినిమా కాదండి. మెగాస్టార్ ఓల్డ్ మూవీ రీ రిలీజ్ కాబోతుంది. చిరంజీవి సూపర్ హిట్ మూవీ ‘గ్యాంగ్ లీడర్’ రీ రిలీజ్ కి సిద్దమవుతుంది.

ఇప్పటికే ఈ సినిమా రీ రిలీజ్ పలుమారులు వాయిదా పడుతూ వచ్చింది. ఈ నెలలోనే పవన్ హిట్ సినిమాలు బద్రి, తొలిప్రేమ చిత్రాలు కూడా రీ రిలీజ్ కి డేట్ ఫిక్స్ చేసుకున్నాయి. అయితే ఈ నెలలో సినిమా రిలీజ్‌లు ఎక్కువ ఉండడంతో థియేటర్ల సర్దుబాటు అవ్వడం లేదు. దీంతో పవన్ రెండు సినిమా వాయిదా వేసి చిరు సినిమాకి లైన్ క్లియర్ చేశాయి. ఫిబ్రవరి 11న గ్యాంగ్ లీడర్ ని రిలీజ్ చేస్తున్నట్లు ప్రకటించారు నిర్వాహకులు. అయితే ఆ ముందురోజే కళ్యాణ్ రామ్ సినిమా అమిగోస్ రిలీజ్ అవుతుంది. వీకెండ్ టైంలో కొత్త సినిమాకి అవకాశం ఇవ్వకుండా ఇలా పాత సినిమాని రిలీజ్ చేయడం ఏంటని నందమూరి అభిమానులు కామెంట్లు చేస్తున్నారు.