Mega154: రవితేజతో మెగాస్టార్ మాస్ చిందులు..?

మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న తాజా చిత్రం ‘మెగా154’ అనే వర్కింగ్ టైటిల్‌తో తెరకెక్కుతోంది. ఈ సినిమాను దర్శకుడు బాబీ తెరకెక్కిస్తుండగా, మాస్ రాజా రవితేజ ఈ మూవీలో ఓ కీలక పాత్రలో నటిస్తున్నాడు. అయితే ఈ సినిమాలో ఓ మాస్ సాంగ్‌లో ఈ ఇద్దరు హీరోలు కలిసి చిందులేయనున్నట్లు సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి.

Mega154: రవితేజతో మెగాస్టార్ మాస్ చిందులు..?

Chiranjeevi Raviteja Mass Song In Mega154

Mega154: మెగాస్టార్ చిరంజీవి నటించిన రీసెంట్ మూవీ ‘గాడ్‌ఫాదర్’ ఇటీవల రిలీజ్ అయ్యి బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని అందుకుంది. ఈ సినిమాలో చిరు సరికొత్త లుక్‌లో కనిపించడంతో ప్రేక్షకులు ఈ సినిమాను చూసేందుకు ఆసక్తిని చూపారు. ఇక ఈ సినిమా అందించిన సక్సెస్‌తో చిరు, తన నెక్ట్స్ చిత్రాన్ని ఫుల్ జోష్‌తో తెరకెక్కిస్తున్నాడు. ఇప్పటికే డబ్బింగ్ పనులు కూడా మొదలుపెట్టిన ఈ సినిమాకు సంబంధించి రోజుకో వార్త నెట్టింట చక్కర్లు కొడుతోంది.

Mega154 NBK107: బాలయ్య-చిరు సినిమా టైటిల్స్‌లో కామన్ పాయింట్.. నిజమేనా?

దర్శకుడు బాబీ తెరకెక్కిస్తున్న ఈ సినిమాను ‘మెగా 154’ అనే వర్కింగ్ టైటిల్‌తో రూపొందిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో చిరు ఊరమాస్ అవతారంలో కనిపించనుండగా, మరో స్టార్ హీరో మాస్ రాజా రవితేజ ఈ సినిమాలో ఓ కీలక పాత్రలో నటిస్తున్నాడు. అయితే ఈ సినిమాలో ఓ మాస్ సాంగ్‌లో చిరు, రవితేజలు కలిసి చిందులు వేయనున్నట్లు ఓ వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. వీరిద్దరు కలిసి చేసే డ్యాన్స్ మెగా ఫ్యాన్స్‌తో పాటు మాస్ రాజా ఫ్యాన్స్‌కు పూనకాలు తెప్పించడం ఖాయమని చిత్ర యూనిట్ అంటోంది.

Mega154: డబ్బింగ్ పనులు మొదలుపెట్టిన మెగా 154!

‘మెగా 154’ సినిమా నుండి రాబోతున్న అప్డేట్స్ కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా చూస్తున్నారు. దీపావళి కానుకగా ఈ సినిమా టైటిల్‌ను అనౌన్స్ చేసేందుకు చిత్ర యూనిట్ రెడీ అవుతోంది. ఇక ఈ సినిమాలో అందాల భామ శ్రుతి హాసన్ హీరోయిన్‌గా నటిస్తుండగా, మైత్రీ మూవీ మేకర్స్ ఈ చిత్రాన్ని ప్రొడ్యూస్ చేస్తున్నారు. థమన్ ఈ సినిమాకు అదిరిపోయే సంగీతాన్ని అందిస్తున్నాడు.