Adipurush: ఆదిపురుష్ ఇంటర్వెల్‌పై క్రేజీ బజ్.. సినిమాకే హైలైట్ కానుందా..?

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న తాజా చిత్రం ‘ఆదిపురుష్’ కోసం ప్రేక్షకులు ఏ రేంజ్‌లో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారో అందరికీ తెలిసిందే. ఈ సినిమాను బాలీవుడ్ దర్శకుడు ఓం రౌత్ తెరకెక్కిస్తుండగా, రామాయణం ఆధారంగా ఈ సినిమాను చిత్ర యూనిట్ రూపొందిస్తోంది. ఇక ఇప్పటికే రిలీజ్ అయిన ఈ చిత్ర టీజర్ ఈ సినిమాపై అంచనాలను అమాంతం పెంచేసింది. కాగా, వీఎఫ్ఎక్స్ పనులను మరింత గ్రాండ్‌గా చూపెట్టేందుకు ఆదిపురుష్ చిత్ర రిలీజ్‌ను వాయిదా వేశారు.

Adipurush: ఆదిపురుష్ ఇంటర్వెల్‌పై క్రేజీ బజ్.. సినిమాకే హైలైట్ కానుందా..?

Crazy Buzz On Adipurush Interval Episode

Adipurush: యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న తాజా చిత్రం ‘ఆదిపురుష్’ కోసం ప్రేక్షకులు ఏ రేంజ్‌లో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారో అందరికీ తెలిసిందే. ఈ సినిమాను బాలీవుడ్ దర్శకుడు ఓం రౌత్ తెరకెక్కిస్తుండగా, రామాయణం ఆధారంగా ఈ సినిమాను చిత్ర యూనిట్ రూపొందిస్తోంది. ఇక ఇప్పటికే రిలీజ్ అయిన ఈ చిత్ర టీజర్ ఈ సినిమాపై అంచనాలను అమాంతం పెంచేసింది. కాగా, వీఎఫ్ఎక్స్ పనులను మరింత గ్రాండ్‌గా చూపెట్టేందుకు ఆదిపురుష్ చిత్ర రిలీజ్‌ను వాయిదా వేశారు.

Adipurush: ‘ఆదిపురుష్’ రిలీజ్ డేట్‌పై క్లారిటీ ఇచ్చిన ప్రభాస్..!

అయితే తాజాగా ఈ సినిమాకు సంబంధించి ఇండస్ట్రీ వర్గాల్లో ఓ టాక్ జోరుగా వినిపిస్తోంది. ఆదిపురుష్ సినిమాలోని ఇంటర్వెల్ ఎపిసోడ్ నెక్ట్స్ లెవెల్‌లో ఉండబోతుందట. రామాయణం ఆధారంగా తెరకెక్కుతున్నా, ఇంటర్వెల్‌లో వచ్చే యాక్షన్ సీక్వెన్స్ ఈ సినిమాకే హైలైట్‌గా ఉండబోతుందని చిత్ర యూనిట్ ధీమా వ్యక్తం చేస్తోంది. రాముడి పాత్రలో ప్రభాస్ రాక్షసులతో చేసే యుద్ధం ఈ సినిమాపై ఆసక్తిని మరింతగా పెంచేలా ఉండబోతుందట. ఇక ఈ సినిమాలో రాముడి పాత్ర కోసం ప్రభాస్ కష్టం, మనకు తెరపై ఆయన్ను చూస్తే అర్థమవుతుందని చిత్ర యూనిట్ చెబుతోంది.

Adipurush: ఆదిపురుష్ అనుకున్న సమయానికి రావడం కష్టమేనా..?

ఈ సినిమాలో సీత పాత్రలో బాలీవుడ్ భామ కృతి సనన్ నటిస్తోండగా, లంకేశ్ పాత్రలో బాలీవుడ్ నటుడు సైఫ్ అలీ ఖాన్, లక్ష్మణుడి పాత్రలో సన్నీ సింగ్‌ నటిస్తున్నారు. ఈ సినిమాను బాలీవుడ్ ప్రొడక్షన్ హౌజ్ టీ-సిరీస్ అత్యంత భారీ బడ్జెట్‌తో ప్రొడ్యూస్ చేస్తోంది. మరి ఈ సినిమాకు బాక్సాఫీస్ వద్ద ఎలాంటి రెస్పాన్స్ దక్కుతుందో తెలియాలంటే ఈ సినిమా రిలీజ్ అయ్యే వరకు వెయిట్ చేయాల్సిందే.