NTR30: క్రేజీ అప్‌డేట్‌.. సెట్స్ మీదకి తారక్-కొరటాల సినిమా!

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ అండ్ మూవీ లవర్స్ ఈగర్‌గా వెయిట్ చేస్తున్న ఇంట్రెస్టింగ్ అప్ డేట్ ఒకటి రానుంది. తారక్ కొత్త సినిమా అఫీషియల్ గా సెట్స్ మీదకి వెళ్లనుంది.

NTR30: క్రేజీ అప్‌డేట్‌.. సెట్స్ మీదకి తారక్-కొరటాల సినిమా!

#ntr30

NTR30: యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ అండ్ మూవీ లవర్స్ ఈగర్‌గా వెయిట్ చేస్తున్న ఇంట్రెస్టింగ్ అప్ డేట్ ఒకటి రానుంది. తారక్ కొత్త సినిమా అఫీషియల్ గా సెట్స్ మీదకి వెళ్లనుంది. ఆర్ఆర్ఆర్ కోసం మూడేళ్లు కేటాయించిన తారక్ ఇప్పుడు ఆ గ్యాప్ ఫిల్ చేసేందుకు పక్కా ప్లాన్స్ సిద్ధం చేసుకున్నాడు. ఎన్టీఆర్ కొరటాల శివ, ప్రశాంత్ నీల్, అట్లీ, ఉప్పెన దర్శకుడు బుచ్చిబాబులతో వరసగా పాన్ ఇండియా లెవెల్ సినిమాలనే ప్లాన్ చేసుకున్నాడు. ఇందులో ముందుగా కొరటాల శివ సినిమా పట్టాలెక్కనుంది.

Telugu Small Movies: రిలీజ్ కష్టాలు.. చిన్న సినిమాలకు పెద్ద చిక్కులు!

గతంలో ఎన్టీఆర్-కొరటాల కాంబినేషన్ లో వచ్చిన ‘జనతా గ్యారేజ్’ భారీ సక్సెస్ కావడంతో ఈ సినిమాపై భారీ అంచనాలున్నాయి. ఈ సినిమా కథ, బౌండ్ స్క్రిప్ట్ కోసం ముగ్గురు హేమాహేమీ రచయితలైన శ్రీధర్ సీపాన, వేమా రెడ్డిలతో పాటు సీనియర్ రైటర్ సత్యానంద్ సిద్ధం చేయించారు. ఈ సినిమాలో ఎన్టీఆర్ మూడు వేరియేషన్స్ లో కనిపించనుండగా మరింత పగడ్బంధీగా స్క్రిప్ట్ సిద్ధం చేశారు.

Deepika Padukone: అందాల ద‌డ పుట్టిస్తున్న దీపిక ప‌దుకొణె!

ఈ సినిమాలో హీరోయిన్ గా కియారా అద్వానీ.. జాన్వీ కపూర్, సమంతల పేర్లు వినిపిస్తుండగా ఎవరిని ఫైనల్ చేస్తారన్నది సస్పెన్స్ గా ఉంది. ఈ సినిమాను సెట్స్‌ పైకి తీసుకెళ్లేందుకు యూనిట్ ప్లాన్‌ చేయగా.. వచ్చే నెలలో ఈ సినిమాను లాంఛనంగా ప్రారంభించనున్నట్లు తెలుస్తుంది. ఇప్పటికే ఆ దిశగా పనులు మొదలు పెట్టిన కొరటాల అండ్ కో సాధ్యమైనంత త్వరగా ఈ సినిమా షూటింగ్ ముగించేందుకు సిద్ధంగా ఉన్నారట.