RRR కి కష్టాలు : తప్పుకున్న డైసీ ఎడ్గార్ జోన్స్!

300 కోట్ల బడ్జెట్..టాలివుడ్..బాలివుడ్ స్టార్స్..భారీ సెట్టింగులు..ఇలా త్రిబుల్ ఆర్ మూవీ..అందరిలోనూ ఇంట్రెస్ట్‌ని క్రియేట్ చేస్తోంది.

  • Published By: madhu ,Published On : April 12, 2019 / 04:59 AM IST
RRR కి కష్టాలు : తప్పుకున్న డైసీ ఎడ్గార్ జోన్స్!

300 కోట్ల బడ్జెట్..టాలివుడ్..బాలివుడ్ స్టార్స్..భారీ సెట్టింగులు..ఇలా త్రిబుల్ ఆర్ మూవీ..అందరిలోనూ ఇంట్రెస్ట్‌ని క్రియేట్ చేస్తోంది.

300 కోట్ల బడ్జెట్..టాలివుడ్..బాలివుడ్ స్టార్స్..భారీ సెట్టింగులు..ఇలా త్రిబుల్ ఆర్ మూవీ..అందరిలోనూ ఇంట్రెస్ట్‌ని క్రియేట్ చేస్తోంది. అయితే..అంతా సవ్యంగా సాగుతుందనుకున్న టైంలో..కష్టాలు మొదలయ్యాయి. దర్శకధీరుడు రాజమౌళి..ఇప్పుడు నిద్రపోవడం లేదంట. బాహుబలి సిరీస్ తర్వాత..రాజమౌళి డైరెక్షన్‌లో తెరకెక్కుతోన్న..ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ RRR. రామ్ చరణ్ అల్లూరి సీతరామరాజుగా..ఎన్టీఆర్ కొమరం భీంగా నటిస్తోన్న ఈ సినిమా మీద..ఒక్క టాలివుడ్‌లోనే కాదు..దేశవ్యాప్తంగా అందరిలోనూ అంచనాలున్నాయి.
Read Also : APలో 6 పోలింగ్ కేంద్రాల్లో రీ పోలింగ్ ?

మొదటి రెండు షెడ్యూల్స్ షూటింగ్ ని..శరవేగంగా కంప్లీట్ చేసిన రాజమౌళికి..మూడో షెడ్యూల్ లో సమస్యలు ఎదురయ్యాయి. షూటింగ్ ఓ పట్టాన ముందుకి సాగడం లేదు. హీరోయిన్స్ కోసం వెతికి వెతికి..చెర్రీకి జోడీగా ఆలియాని..ఎన్టీఆర్ కి జోడీగా ఫారెన్ బ్యూటీ డైసీ ఎడ్గార్ జోన్స్ ని..రాజమౌళి ఫిక్స్ చేశాడు. ఓ పెద్ద పని పూర్తయ్యింది..హమ్మయ్యా అనుకునే టైంలోనే..డైసీ ఎడ్గార్..త్రిబుల్ ఆర్‌లో నటించలేనంటూ..సడెన్ గా తప్పుకుంది. దీంతో సమస్య మళ్లీ మొదటికొచ్చింది. ఇప్పుడు ఎన్టీఆర్ కి జోడీ కోసం..రాజమౌళి సెర్చింగ్ మొదలుపెట్టాడు. బాలివుడ్ హీరోయిన్ జాన్వీ కపూర్ ని సంప్రదిస్తున్నట్లు వార్తలొస్తున్నాయి. అంతేకాదు..నిత్య మీనన్ ని లుక్ టెస్ట్ కోసం పిలిచినట్లు సమాచారం.

ఇక షూటింగ్‌ని పరుగుపెట్టిద్దామని డిసైడై..45 రోజుల షెడ్యూల్ కోసం వడోదర వెళ్తే..అక్కడ జిమ్ లో వర్కవుట్ చేస్తుండగా చరణ్ కి గాయమైంది..దీంతో షూటింగ్ కి మూడు వారాల గ్యాప్ వచ్చింది. మరోవైపు..బాలివుడ్‌లో చాలా బిజీగా ఉండే హీరోయిన్ ఆలియా..చాలా కష్టపడి త్రిబుల్ ఆర్ కోసం డేట్స్ అడ్జెస్ట్ చేసింది. అలాంటిది..ఇప్పుడు షూటింగ్‌కి గ్యాప్ రావడంతో..ఎంతో విలువైన ఆలియా డేట్స్ వేస్ట్ అయిపోతున్నాయి. ఈ గ్యాప్‌లో ఆలియా మరో సినిమాకి ఓకే చెప్పిందంటే..మళ్లీ ఎప్పుడు ఖాళీ అవుతుందో తెలియదు. ఇలా..RRR సినిమాని కష్టాలు..ఓ రేంజ్ లో వెంటాడుతున్నాయి.
Read Also : బద్దకించిన నగరవాసులు : హైదరాబాద్‌లో తగ్గిన పోలింగ్