Dasara Movie: నాని దసరా సెన్సార్ రిపోర్ట్.. రన్‌టైమ్ ఎంతంటే..?

నాని, కీర్తి సురేష్ జంటగా తెరకెక్కిన తాజా చిత్రం ‘దసరా’ ఇప్పటికే ప్రేక్షకుల్లో మంచి అంచనాలు క్రియేట్ చేయడంలో సక్సెస్ అయ్యింది. శ్రీకాంత్ ఓదెల తెరకెక్కించిన ఈ సినిమాను మార్చి 30న రిలీజ్ చేస్తుండగా, ఈ సినిమా రన్‌టైమ్‌ను 2 గంటల 39 నిమిషాలకు లాక్ చేసింది చిత్ర యూనిట్.

Dasara Movie: నాని దసరా సెన్సార్ రిపోర్ట్.. రన్‌టైమ్ ఎంతంటే..?

Dasara Movie Completes Censor And Locks Runtime

Dasara Movie: నేచురల్ స్టార్ నాని నటిస్తున్న తాజా చిత్రం ‘దసరా’ ఇప్పటికే ప్రేక్షకుల్లో అదిరిపోయే అంచనాలు క్రియేట్ చేసింది. ఈ సినిమాను శ్రీకాంత్ ఓదెల తెరకెక్కించగా, రా అండ్ రస్టిక్ మూవీగా చిత్ర యూనిట్ రూపొందించడంతో ఈ సినిమాను ఎప్పుడెప్పుడు చూద్దామా అని అభిమానులు ఎంతో ఆసక్తిగా చూస్తున్నారు. కాగా, ఈ సినిమాను మార్చి 30న పాన్ ఇండియా స్థాయిలో భారీగా రిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్ రెడీ అయ్యింది.

Dasara Movie: దసరా మూవీకి 36 కోతలు పెట్టిన సెన్సార్..?

ఇక ఈ సినిమా సెన్సార్ పనులు కూడా ముగించుకుని రిలీజ్‌కు రెడీ అయినట్లుగా చిత్ర యూనిట్ తెలిపింది. ఈ సినిమాకు సెన్సార్ బోర్డు యూ/ఏ సర్టిఫికెట్ ను జారీ చేసింది. ఈ సినిమాలోని కంటెంట్ ప్రేక్షకులకు మాస్ ఫీస్ట్ ఇవ్వనుందని చిత్ర యూనిట్ అంటోంది. ఇక ఈ సినిమాకు సెన్సార్ బోర్డు భారీగా కట్స్ విధించినట్లుగా తెలుస్తోంది. ఈ సినిమా రన్‌టైమ్‌ను 2 గంటల 39 నిమిషాలకు లాక్ చేసింది చిత్ర యూనిట్.

Dasara Movie: ప్రీరిలీజ్ ఈవెంట్‌తో దుమ్ములేపేందుకు డేట్, ప్లేస్ ఫిక్స్ చేసిన ‘దసరా’

ఒక యాక్షన్ ఎంటర్‌టైనర్ మూవీకి ఇది చాలా మంచి రన్‌టైమ్ అని చిత్ర వర్గాలు అంటున్నాయి. ఈ సినిమాలో నాని పర్ఫార్మెన్స్ ప్రేక్షకులను కట్టిపడేస్తుందని, థియేటర్ నుండి బయటకు వచ్చినా ధరణి పాత్ర ప్రేక్షకులకు గుర్తుండిపోతుందని చిత్ర యూనిట్ ధీమా వ్యక్తం చేస్తోంది. ఈ సినిమాకు సంతోష్ నారాయణన్ సంగీతం అందిస్తుండగా, అందాల భామ కీర్తి సురేష్ ఈ సినిమాలో హీరోయిన్‌గా నటిస్తోంది.