ఇదేం ట్రైలర్ బాబోయ్!

'1940లో ఒకగ్రామం', 'లజ్జ', 'కమలతో నా ప్రయాణం' లాంటి అభిరుచి కలిగిన సినిమాలు తీసిన దర్శకుడు నరసింహ నంది, 'డిగ్రీ కాలేజ్' సినిమా తియ్యడం ఆశ్చర్యం కలిగించే విషయమే..

  • Published By: sekhar ,Published On : May 3, 2019 / 12:23 PM IST
ఇదేం ట్రైలర్ బాబోయ్!

‘1940లో ఒకగ్రామం’, ‘లజ్జ’, ‘కమలతో నా ప్రయాణం’ లాంటి అభిరుచి కలిగిన సినిమాలు తీసిన దర్శకుడు నరసింహ నంది, ‘డిగ్రీ కాలేజ్’ సినిమా తియ్యడం ఆశ్చర్యం కలిగించే విషయమే..

ఏ ముహుర్తాన అర్జున్ రెడ్డి, ఆర్ఎక్స్ 100 సినిమాలొచ్చాయో కానీ, అప్పటినుండి రిలీజ్ అయ్యే ప్రతి సినిమాలోనూ అడల్ట్ కంటెంట్, డబుల్ మీనింగ్ డైలాగ్స్, పచ్చి బూతులు, విచ్చలవిడి రొమాన్స్ అనేవి కామన్ అయిపోయాయి. ఈ మధ్య వచ్చిన ‘ఏడు చేపల కథ’, ‘చీకటి గదిలో చితక్కొట్టుడు’ తరహాలోనే, ఒక రకంగా చెప్పాలంటే వాటికి మించి ‘డిగ్రీ కాలేజ్’ అనే సినిమా రూపొందింది. ‘1940లో ఒకగ్రామం’, ‘లజ్జ’, ‘కమలతో నా ప్రయాణం’ లాంటి అభిరుచి కలిగిన సినిమాలు తీసిన దర్శకుడు నరసింహ నంది ఈ సినిమాకి దర్శకుడు కావడం ఆశ్చర్యం కలిగించే విషయమే.

రీసెంట్‌గా డిగ్రీ కాలేజ్ ట్రైలర్ రిలీజ్ అయ్యింది. వరుణ్, శ్రీదివ్య హీరో, హీరోయిన్‌గా పరిచయం అవుతున్నారు. అమ్మాయి, అబ్బాయి ఒకరినొకరు లవ్ చేసుకోవడం, అమ్మాయి తండ్రి ఒప్పుకోకపోతే పారిపోవడం, పోలీస్ అయిన అమ్మాయి తండ్రి అబ్బాయిని పట్టుకుని చిత్రహింసలు పెట్టడం.. ఇక అమ్మాయి, అబ్బాయి ప్రేమ పేరుతో ఓ రేంజ్‌లో హద్దులు దాటడం.. ఇలా చెప్పుకుంటూ పోతే, బాబోయ్ మామూలు రచ్చ చెయ్యలేదు.. మెయిన్‌గా యూత్‌ని టార్గెట్ చేసి, వాళ్ళకి కావల్సిన మసాలా అంతా దట్టించారు. నేషనల్ అవార్డ్ సాధించిన నరసింహ నంది ఇలాంటి సినిమా తీసాడేంటబ్బా.. అని ట్రైలర్ చూసిన వాళ్ళందరూ షాక్ అవుతున్నారు.

వాచ్ ట్రైలర్..