బిగ్‌బాస్ సీక్రెట్ ట్విస్ట్: సెకెండ్ ఎలిమినేషన్ ఆమెనే.. కానీ!

  • Edited By: vamsi , September 20, 2020 / 12:01 PM IST
బిగ్‌బాస్ సీక్రెట్ ట్విస్ట్: సెకెండ్ ఎలిమినేషన్ ఆమెనే.. కానీ!

బోరింగ్‌గా మొదలైందే అనే ఫీలింగ్‌లో నుంచి బిగ్‌బాస్ ఇప్పుడిప్పుడే బయటకు వస్తుంది. బిగ్‌బాస్‌లో రెండో వారంలోనే డబుల్ ఎలిమినేష‌న్ అంటూ ట్విస్ట్ ఇచ్చేశారు. దీంతో నామినేష‌న్‌లో ఉన్న కంటెస్టెంట్లకు కాస్త ఎక్కువగానే భయం పట్టుకుంది. ఈ క్రమంలోనే శనివారం బిగ్‌బాస్ నుంచి కరాటే కళ్యాణీ ఎలిమినేట్ అయ్యింది.

బిగ్‌బాస్‌ వీకెండ్ షోను హోస్ట్ నాగార్జున షేక్ చేస్తున్నారు. కంటెస్టెంట్‌‌లపై నాగ్‌ ఫైర్ అవ్వడం.. సెల్ఫ్ నామినేట్ అయిన వాళ్లందరినీ సేఫ్ గేమ్ ఆడారంటూ కడిగి పారేయ్యడం జరిగాక.. ఈ వారం డబుల్‌ ఎలిమినేషన్ ఉంటుందంటూ చెప్పిన నాగార్జున, మొదటగా కరాటే కళ్యాణిని బయటకు పంపారు. ఈ వారం నామినేషన్‌లో మొత్తం తొమ్మిది మంది ఉండగా.. వారిలో గంగవ్వను మొదట సేఫ్ చేశారు నాగార్జున. మిగిలిన ఎనిమిది మందిలో అమ్మరాజశేఖర్, కుమార్ సాయి, నోయల్, కరాటే కళ్యాణి, హారిక, అభిజిత్, మోనాల్, సొహైల్‌‌లలో కరాటే కళ్యాణి ఎలమినేట్ అయినట్టు వెల్లడించారు.ఇక రెండవ ఎలిమినేషన్‌ ఎవరు? అనేదే పెద్ద ప్రశ్న.. అయితే ఇప్పుడు తెలుస్తున్న సమాచారం ప్రకారం రెండవ ఎలిమినేషన్ దేత్తడి హారిక అని తెలుస్తుంది. అయితే అక్కడే చిన్న ట్విస్ట్ ఇచ్చాడు బిగ్ బాస్.

బిగ్‌బాస్‌ మూడవ సీజన్‌లో తొమ్మిదో వారంలో డబుల్‌ ఎలిమినేషన్‌ అని చెప్పి రాహుల్‌ ఎలిమినేట్‌ అయినట్టు ప్రకటించి.. సీక్రెట్ రూమ్‌కి పంపినట్లే.. ఇప్పుడు దేత్తడి హారికను కూడా ఎలిమినేట్ చేసినట్లే చేసి సీక్రెట్ రూమ్‌కి పంపిస్తున్నారట. అప్పుడు సీక్రెట్ రూమ్‌లోకి వెళ్లిన రాహులే చివరకు బిగ్‌బాస్ విన్నర్ అయిన సంగతి తెలిసిందే. రాహుల్‌ది ఫేక్‌ ఎలిమినేషన్‌ అయినట్లే ఇప్పడు దేత్తడి హారికను ఫేక్ ఎలిమినేట్ చేస్తున్నారు.