Devara : ఎన్టీఆర్ ‘దేవర’ సినిమా ఇంగ్లీష్ వర్షన్ ఉందా? చిత్రయూనిట్ ఏం చెప్పారో చూడండి..

దేవర సినిమా ఫుల్ మాస్ యాక్షన్ గా ఉంటుందని ఇప్పటికే కొరటాల శివ చెప్పారు. ఇక ఈ సినిమాని పాన్ ఇండియా సినిమాగా తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో రిలీజ్ చేస్తామని కూడా ప్రకటించారు. అయితే ఈ సినిమాని ఇంగ్లీష్ లో కూడా డబ్బింగ్ చేసి హాలీవుడ్ లో రిలీజ్ చేస్తారని వార్తలు వచ్చాయి.

Devara : ఎన్టీఆర్ ‘దేవర’ సినిమా ఇంగ్లీష్ వర్షన్ ఉందా? చిత్రయూనిట్ ఏం చెప్పారో చూడండి..

Devara Movie will Release in English Version also Rumours goes viral Movie Unit gives clarity

Updated On : August 23, 2023 / 6:55 AM IST

Devara Movie : RRR తర్వాత ఎన్టీఆర్(JR NTR) నుంచి రాబోతున్న సినిమా ‘దేవ‌ర‌'(Devara) అవ్వడంతో ఈ సినిమాపై భారీ ఆంచనాలు ఉన్నాయి. కొరటాల శివ(Koratala Siva) ద‌ర్శ‌క‌త్వంలో బాలీవుడ్ న‌టి జాన్వీ క‌పూర్(Janhvi Kapoor) హీరోయిన్‌గా, సైఫ్ అలీఖాన్ (Saif Ali Khan), మలయాళ నటుడు షైన్ టామ్‌ చాకో విలన్స్ గా దేవర సినిమా తెరకెక్కుతుంది. ఎన్టీఆర్ ఆర్ట్స్, యువ‌సుధ ఆర్ట్స్ బ్యాన‌ర్ల‌పై మిక్కిలినేని సుధాకర్, నందమూరి కళ్యాణ్ రామ్ లు ఈ సినిమాని నిర్మిస్తున్నారు. ప్రస్తుతం దేవర సినిమా షూటింగ్ దశలో ఉంది.

దేవర సినిమా ఫుల్ మాస్ యాక్షన్ గా ఉంటుందని ఇప్పటికే కొరటాల శివ చెప్పారు. ఇక ఈ సినిమాని పాన్ ఇండియా సినిమాగా తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో రిలీజ్ చేస్తామని కూడా ప్రకటించారు. అయితే ఈ సినిమాని ఇంగ్లీష్ లో కూడా డబ్బింగ్ చేసి హాలీవుడ్ లో రిలీజ్ చేస్తారని వార్తలు వచ్చాయి. ఎన్టీఆర్ RRR సినిమా, ఆస్కార్ ప్రయాణంతో హాలీవుడ్ లో కూడా ఎన్టీఆర్ కి మంచి గుర్తింపు వచ్చింది. దీంతో దేవర సినిమాని ఇంగ్లీష్ లో కూడా రిలీజ్ చేస్తారని వార్తలు వచ్చాయి.

Neha Shetty : డీజే టిల్లు సీక్వెల్ లో నేహశెట్టి గెస్ట్ అప్పీరెన్స్.. రాధిక మళ్లీ వచ్చేస్తుంది..

దీంతో ట్విట్టర్ లో ఓ పేజీ దేవర సినిమా అధికార పేజీని ట్యాగ్ చేస్తూ దేవర సినిమా ఇంగ్లీష్ వర్షన్ లో కూడా ఉందంట నిజమేనా? అని అడిగింది. దీంతో చిత్రయూనిట్ దీనికి కౌంటర్ సమాధానం ఇచ్చింది. ఆ ట్వీట్ కి రిప్లై ఇస్తూ.. నీది కాదు తప్పు. నిన్ను నమ్ముతున్నారు చూడు నువ్వు రోజూ వేసే ట్వీట్స్ కి, వాళ్ళది తప్పు అని రిప్లై ఇచ్చింది. దీంతో ఆ పేజికి ఇలాంటి తప్పుడు వార్తలు ప్రచారం చేయకు అని ఇండైరెక్ట్ గా గట్టిగానే కౌంటర్ ఇచ్చింది. అభిమానులు ఆ ట్విట్టర్ పేజీని బాగా ట్రోల్ చేస్తున్నారు. అలాగే ఇంగ్లీష్ వర్షన్ నిజంగా లేదా అని నిరాశ కూడా చెందుతున్నారు.