అచ్చు మేనమామలానే.. మెగా మేనల్లుడి ‘ధ‌క్ ధ‌క్ ధ‌క్’ సాంగ్ చూశారా!

‘ఉప్పెన’- ‘ధ‌క్ ధ‌క్ ధ‌క్’ వీడియో సాంగ్ రిలీజ్..

  • Published By: sekhar ,Published On : March 9, 2020 / 02:37 PM IST
అచ్చు మేనమామలానే..  మెగా మేనల్లుడి ‘ధ‌క్ ధ‌క్ ధ‌క్’ సాంగ్ చూశారా!

‘ఉప్పెన’- ‘ధ‌క్ ధ‌క్ ధ‌క్’ వీడియో సాంగ్ రిలీజ్..

వైష్ణ‌వ్ తేజ్‌, కృతి శెట్టి హీరో హీరోయిన్లుగా, బుచ్చిబాబు సానా ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌య‌మ‌వుతున్న ‘ఉప్పెన’ చిత్రంలోని మొద‌టి పాట‌ను ఇటీవ‌ల స్టార్ డైరెక్ట‌ర్ కొర‌టాల శివ రిలీజ్ చేసిన విష‌యం విదిత‌మే. దేవి శ్రీ‌ప్ర‌సాద్ సంగీతం స‌మ‌కూర్చ‌గా ఖ‌వ్వాలీ త‌ర‌హాలో సాగే ‘నీ క‌న్ను నీలి స‌ముద్రం’ అనే ఈ పాట తక్కువ సమయంలోను 10 మిలియ‌న్ వ్యూస్ దాటేసింది.

ఇటీవ‌లి కాలంలో బాగా పాపుల‌ర్ అయిన పాట‌ల్లో ఒక‌టిగా నిలవడం విశేషం. సోమవారం సాయంత్రం  ‘ధ‌క్ ధ‌క్ ధ‌క్’ అంటూ సాగే వీడియో సాంగ్ రిలీజ్ చేశారు. దేవి ట్యూన్, చంద్రబోస్ లిరిక్స్, శరత్ సంతోష్, హరిప్రియల వాయిస్, షామ్‌ద‌త్ సైనుద్దీన్ విజువల్స్, హీరో హీరోయిన్ల కెమిస్ట్రీ అన్నీ సమపాళ్లలో కలగలసిన ఈ పాట లిరికల్‌గానూ, విజువల్‌గానూ ఆకట్టుకుంటోంది.

‘మక్కల్ సెల్వన్’ విజ‌య్ సేతుప‌తి కీలకపాత్రలో నటిస్తున్నారు. సుకుమార్ రైటింగ్స్ బ్యాన‌ర్‌తో క‌లిసి మైత్రీ మూవీ మేక‌ర్స్ సంస్థలు నిర్మిస్తున్నాయి. ప్రేమ, కుటుంబ విలువల నేపథ్యంలో తెరకెక్కుతున్న ‘ఉప్పెన’ చిత్రాన్ని 2020 ఏప్రిల్ 2న విడుదల చేయనున్నారు. కెమెరా : శ్యామ్ దత్ సైనుద్దీన్, ఎడిటింగ్ : నవీన్ నూలి, ఆర్ట్ : మౌనిక రామకృష్ణ, ఫైట్స్ : వెంకట్, కొరియోగ్రఫీ : బృంద, ప్రేమ్ రక్షిత్, సీఈఓ : చెర్రీ, సమర్పణ : సుకుమార్, నిర్మాతలు : నవీన్ ఎర్నేని, వై.రవి శంకర్, సుకుమార్.