Dil Raju : సమంత సినిమాలపై దిల్ రాజు సంచలన వ్యాఖ్యలు.. ఆ రెండు సినిమాలతో నాకు బాగా అర్థమైంది..

ఇటీవల నిర్మాత దిల్ రాజు శాకుంతలం ఫెయిల్యూర్ గురించి మాట్లాడుతూ ఈ సినిమా నా 25 ఏళ్ళ కెరీర్ లోనే పెద్ద జర్క్ ఇచ్చిందని ఓ ఇంటర్వ్యూలో అనడంతో ఆ టీజర్ బాగా వైరల్ అయింది.

Dil Raju : సమంత సినిమాలపై దిల్ రాజు సంచలన వ్యాఖ్యలు.. ఆ రెండు సినిమాలతో నాకు బాగా అర్థమైంది..

Dil Raju sensational comments on Samantha movies

Dil Raju :  సమంత(Samantha) ఇటీవల శాకుంతలం(Shakunthalam) సినిమాతో ప్రేక్షకుల ముందుకి వచ్చింది. ఈ సినిమా దారుణంగా పరాజయం పాలైంది. చాలా రోజుల గ్యాప్ తర్వాత సమంత డైరెక్ట్ గా వచ్చి ప్రమోషన్స్ చేసినా ఈ సినిమాని ఎవ్వరూ పట్టుంచుకోలేదు. పురాణాల్లోని కథ, ఎపిక్ లవ్ స్టోరీ అంటూ గుణశేఖర్(Guna Sekhar) దర్శకత్వంలో తెరకెక్కిన శాకుంతలం సినిమాని బాగానే ప్రమోట్ చేశారు. పాన్ ఇండియా రిలీజ్ చేశారు. కానీ ఈ సినిమా ఆశించినంత విజయం సాధించలేదు. ఈ సినిమా వల్ల నిర్మాతలుగా గుణశేఖర్, దిల్ రాజు(Dil Raju) భారీగానే నష్టపోయారు.

సమంత మార్కెట్ ని మించి బడ్జెట్ పెట్టి లాస్ ని చూశారు. ఇటీవల నిర్మాత దిల్ రాజు శాకుంతలం ఫెయిల్యూర్ గురించి మాట్లాడుతూ ఈ సినిమా నా 25 ఏళ్ళ కెరీర్ లోనే పెద్ద జర్క్ ఇచ్చిందని ఓ ఇంటర్వ్యూలో అనడంతో ఆ టీజర్ బాగా వైరల్ అయింది. టాలీవుడ్ లో అగ్ర నిర్మాతగా ఉన్న దిల్ రాజుకి భారీ ఫ్లాప్స్ అంటే తన కెరీర్ లో వేళ్ళ మీద లెక్కపెట్టొచ్చు. తాజాగా దిల్ రాజు ఇచ్చిన ఆ ఇంటర్వ్యూ రిలీజయింది.

Abhishek Bachchan : ఆమెకు నా పర్మిషన్ అవసరం లేదు.. ఐశ్వర్యరాయ్ పై భర్త అభిషేక్ ట్వీట్ వైరల్..

ఈ ఇంటర్వ్యూలో దిల్ రాజు మాట్లాడుతూ సమంత సినిమాలపై సంచలన వ్యాఖ్యలు చేశాడు. దిల్ రాజు మాట్లాడుతూ.. శాకుంతలం సినిమా నా కెరీర్ లో పెద్ద జర్క్ ఇచ్చింది. ఆడియన్స్ కి ఆ సినిమా నచ్చలేదు అంటే ఫ్లాప్ అయిందనే అర్ధం. నా జడ్జిమెంట్ తప్పయింది. అలాగే సమంత జాను సినిమా కూడా నేను ఆశించినంత విజయం ఇవ్వలేదు కరోనా వల్ల దాని ఒరిజినల్ సినిమా 96 అందరూ చూసేసారు. అందుకే జాను ఆడలేదు. అలాగే హిందీలో జెర్సీ సినిమా రీమేక్ కూడా ఆడలేదు. ఈ రెండు సినిమాలు పోవడంతో ఇంకెప్పుడు రీమేక్ సినిమాలు తీయకూడదు అని అర్థమైంది. ఇప్పుడు ఓటీటీ వల్ల అందరికి అన్ని సినిమాలు చేరువవుతున్నాయి అని అన్నారు. దీంతో దిల్ రాజు శాకుంతలం, జాను సినిమాలపై చేసిన వ్యాఖ్యలు వైరల్ గా మారాయి. మరి సమంత కానీ, సమంత అభిమానులు కానీ దిల్ రాజు మాటలకూ ఎలా స్పందిస్తారో చూడాలి.