Gunasekhar: గుణశేఖర్ క్లారిటీ.. తొలిగిపోయిన అనుమానాలు!

టాలీవుడ్ దర్శకుల్లో తనకంటూ ప్రత్యేక గుర్తింపును తెచ్చుకుని చాలా సెలెక్టివ్‌గా సినిమాలు చేస్తూ బాక్సాఫీస్ వద్ద బ్లాక్‌బస్టర్స్ అందుకున్న డైరెక్టర్ గుణశేఖర్. ఈ డైరెక్టర్ తెరకెక్కిస్తున్న తాజా చిత్రం ‘శాకుంతలం’ ఇప్పటికే షూటింగ్ పనులు ముగించుకుంది. ఈ సినిమా గురించి తాజాగా దర్శకుడు గుణశేఖర్ ఓ క్లారిటీ ఇచ్చారు.

Gunasekhar: గుణశేఖర్ క్లారిటీ.. తొలిగిపోయిన అనుమానాలు!

Gunaskehar: టాలీవుడ్ దర్శకుల్లో తనకంటూ ప్రత్యేక గుర్తింపును తెచ్చుకుని చాలా సెలెక్టివ్‌గా సినిమాలు చేస్తూ బాక్సాఫీస్ వద్ద బ్లాక్‌బస్టర్స్ అందుకున్న డైరెక్టర్ గుణశేఖర్. ఈ దర్శకుడు తెరకెక్కించిన లాస్ట్ మూవీ ‘రుద్రమదేవి’ టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని అందుకుంది. ఇక ఆ తరువాత ఈ డైరెక్టర్ తెరకెక్కిస్తున్న తాజా చిత్రం ‘శాకుంతలం’ ఇప్పటికే షూటింగ్ పనులు ముగించుకుంది.

Shaakuntalam: శాకుంతలం నుంచి తాజా అప్డేట్.. ఏమిటంటే?

షూటింగ్ ముగిసినా, పోస్ట్ ప్రొడక్షన్ పనులు ఆలస్యం అవుతుండటంతో ‘శాకుంతలం’ చిత్ర రిలీజ్‌లో ఆలస్యం అవుతూ వస్తోంది. దీంతో ఈ సినిమా ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అందరూ ఆసక్తిగా చూస్తున్నారు. ఈ సినిమాలో స్టార్ బ్యూటీ సమంత హీరోయిన్‌గా నటిస్తుండటంతో ఈ సినిమాపై అంచనాలు ఓ రేంజల్‌లో క్రియేట్ అయ్యాయి. ఇక ఈ సినిమా గురించి తాజాగా దర్శకుడు గుణశేఖర్ ఓ క్లారిటీ ఇచ్చారు. ఈ సినిమాను అన్ని విధాలా ప్రేక్షకులు మెచ్చే విధంగా తీర్చిదిద్దడంలో తాము ఉన్నామని.. ఈ సినిమాను అందరూ అనుకుంటున్నట్లుగానే మంచి సినిమాగా ప్రెజెంట్ చేసేందుకు తన టీమ్ కష్టపడుతున్నట్లు ఆయన పేర్కొన్నాడు.

Gunasekhar : అన్‌కాంప్రమైజ్డ్‌ స్టైలిష్‌ మూవీ మేకర్‌ గుణశేఖర్‌..

ఈ క్రమంలోనే తన నెక్ట్స్ మూవీ గురించి కూడా ఈ డైరెక్టర్ క్లారిటీ ఇచ్చాడు. తాను గతంలో చెప్పినట్లుగానే హిరణ్యకశ్యప జీవితకథను సినిమాగా తెరకెక్కించేందుకు భారీ ఎత్తున ప్లాన్ చేస్తున్నానని.. త్వరలోనే ఈ సినిమాకు సంబంధించిన అఫీషియల్ అనౌన్స్‌మెంట్‌ను ఇస్తానని గుణశేఖర్ ఈ సందర్భంగా తెలిపాడు. దీంతో అటు శాకుంతలం అభిమానులతో పాటు హిరణ్యకశ్యప చిత్రం కోసం ఎంతో ఆసక్తిగా చూస్తున్నవారు కూడా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇక ఈ సినిమాలో రానా దగ్గుబాటిని లీడ్ రోల్‌లో తీసుకునేందుకు గుణశేఖర్ ప్లాన్ చేస్తున్నాడు.