Hotstar : ఐపీఎల్ పోయింది.. ఇప్పుడు HBO కూడా.. ఇండియాలో డిస్నీప్లస్ హాట్‌స్టార్ పని అయిపోయిందా?

డిస్నీప్లస్ హాట్‌స్టార్ ఇండియాలో ఎక్కువగా ఓ టీవీ ఛానల్ కంటెంట్, ఐపీఎల్ మ్యాచ్ లతోనే బాగా పాపులర్ అయింది. చాలామంది ఐపీఎల్ కోసమే దీని సబ్‌స్క్రిప్షన్ తీసుకున్నారు. ఇటీవల ఐపీఎల్ హక్కులు వేరే సంస్థ చేజిక్కించుకోవడంతో డిస్నీప్లస్ హాట్‌స్టార్ కి ఆదరణ తగ్గింది. దీంతో...................

Hotstar : ఐపీఎల్ పోయింది.. ఇప్పుడు HBO కూడా.. ఇండియాలో డిస్నీప్లస్ హాట్‌స్టార్ పని అయిపోయిందా?

Disney Plus Hotstar loosing audience with low content and HBO outs from Hotstar

Hotstar :  కరోనా సమయంలో, ఆ తర్వాత ఓటీటీలకు ఆదరణ బాగా పెరిగింది. దీంతో అనేక ఓటీటీలు ఇండియన్ మార్కెట్ మీద కన్నేసి తమ వ్యాపారాన్ని విస్తరించాయి. కొత్త కొత్త సినిమాలు, సిరీస్ లు, షోలతో ప్రేక్షకులని ఆకర్షించాయి. అలాంటి ఓటీటీలో డిస్నీప్లస్ హాట్‌స్టార్ ఒకటి. ముందు హాట్ స్టార్ పేరుతో వచ్చినా ఆ తర్వాత డిస్నీ సంస్థతో ఒప్పందం కుదుర్చుకొని డిస్నీప్లస్ హాట్‌స్టార్ గా మారింది.

డిస్నీప్లస్ హాట్‌స్టార్ ఇండియాలో ఎక్కువగా ఓ టీవీ ఛానల్ కంటెంట్, ఐపీఎల్ మ్యాచ్ లతోనే బాగా పాపులర్ అయింది. చాలామంది ఐపీఎల్ కోసమే దీని సబ్‌స్క్రిప్షన్ తీసుకున్నారు. ఇటీవల ఐపీఎల్ హక్కులు వేరే సంస్థ చేజిక్కించుకోవడంతో డిస్నీప్లస్ హాట్‌స్టార్ కి ఆదరణ తగ్గింది. దీంతో సబ్‌స్క్రయిబర్స్ కూడా తగ్గారు. అలాగే వేరే ఓటీటీలు అన్నీ కొత్త కొత్త కంటెంట్ ని నిర్మిస్తూ ప్రేక్షకుల ముందుకి తెస్తుంటే హాట్ స్టార్ మాత్రం కొత్త కంటెంట్ మీద ఎక్కువగా ఫోకస్ చెయ్యట్లేదు. దీనివల్ల కూడా హాట్ స్టార్ కి ఆదరణ తగ్గింది. ఇక డిస్నీప్లస్ హాట్‌స్టార్ కి ఎక్కువగా యాక్షన్ సినిమాలు, హాలీవుడ్ సినిమాలు చూసేవాళ్ళు ఆడియన్స్ గా ఉన్నారు. హాలీవుడ్ HBO ఛానల్ సినిమాలు, సిరీస్ లు అన్నీ హాట్ స్టార్ లో వచ్చేవి. అయితే HBO, హాట్ స్టార్ ఒప్పందం మార్చ్ 31 తో ముగియనుంది. ఇప్పటికే కొన్ని HBO కంటెంట్స్ ని హాట్ స్టార్ నుంచి తీసేసారు. మార్చ్ 31 నుంచి పూర్తిగా తీసేయనున్నారు.

Nayan-Vignesh : ఫస్ట్ టైం తమ కవల పిల్లలతో బయట కనపడ్డ నయన్, విగ్నేష్..

 

ఈ విషయాన్ని హాట్ స్టార్ స్వయంగా వెల్లడించింది. HBO కంటెంట్ హాట్ స్టార్ లో చూసే ఇండియన్ ఆడియన్స్ ఆ కంటెంట్ కనపడకపోవడంతో హాట్ స్టార్ ని ప్రశ్నిస్తూ ట్వీట్స్ చేయగా హాట్ స్టార్ రిప్లై ఇస్తూ ఈ విషయాన్ని తెలిపింది. దీంతో పలువురు సబ్‌స్క్రయిబర్స్ మా డబ్బులు వెన్కక్కి ఇచ్చేయాలని కామెంట్స్ చేస్తుండగా, అలా కుదరదు, ఇంకా చాలా కంటెంట్ ఉంది చూడండి అని హాట్ స్టార్ అంటుంది. దీంతో హాట్ స్టార్ పై విమర్శలు తలెత్తుతున్నాయి. అలాగే వేరే ఓటీటీలతో పోలిస్తే హాట్ స్టార్ సబ్‌స్క్రిప్షన్ ఫీజ్ కూడా కొంచెం ఎక్కువే. ప్రస్తుతం సంవత్సరానికి 899 రూపాయలు కట్టాలి. అదే ప్రీమియర్ అయితే 1499 కట్టాలి. కంటెంట్ లేనప్పుడు ఇంత అమౌంట్ ఎందుకు అంటూ విమర్శలు వస్తున్నాయి. ఓ పక్కన లోకల్, ఇంటర్నేషనల్ ఓటీటీలు ఇండియన్ మార్కెట్ లో స్థానం కోసం కొత్త కొత్త కంటెంట్ తో దూకుడుగా వ్యవహరిస్తుంటే హాట్ స్టార్ మాత్రం కొత్త కంటెంట్ లేక, ఐపీఎల్ దూరమై, HBO దూరమవుతూ ఆడియన్స్ ని దూరం చేసుకుంటుంది. ఇలాగే కంటిన్యూ చేస్తే ఇండియాలో డిస్నీప్లస్ హాట్‌స్టార్ పని అయిపోయినట్టే అని అంటున్నారు నెటిజన్లు, యూజర్లు.