నా బర్త్‌డే సెలబ్రేట్ చేయద్దు: రామ్ చరణ్

  • Published By: veegamteam ,Published On : March 18, 2020 / 05:58 AM IST
నా బర్త్‌డే సెలబ్రేట్ చేయద్దు: రామ్ చరణ్

కరోనా పేరు వింటే చాలు ప్రజలు వణికిపోతున్నారు. ప్రస్తుతం క‌రోనా భ‌యంతో స్కూల్స్‌, థియేట‌ర్స్‌, షూటింగ్స్‌, పెళ్ళిళ్ళు, షాపింగ్ మాల్స్ అన్నీ మూసివేశారు. అయితే ఈ మార్చి 27న రామ్‌చరణ్ పుట్టిన రోజు సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా తన అభిమానులందరిని కోరాడు.

అదేంటంటే.. నా పుట్టినరోజుకి ఎవ్వరు హడావిడి చేయద్దు, వేడుక‌ల‌కి దూరంగా ఉండాల‌ని చెప్పారు. మీరంతా మన అధికారులకు సహకరించి కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టే విధానాలు ప్రజలకి అర్ధమయ్యే విధంగా తెలియజేయండి. ఈ సంవత్సరం అదే నాకు మీరు ఇచ్చే పెద్ద పుట్టిన రో్జు కానుక. నా కోరికను మీరంతా స్వీకరించి పాటిస్తారని ఆశిస్తున్నాను అని తెలిపారు.

తాజాగా ఎన్టీఆర్‌తో క‌లిసి కరోనా గురించి ఓ వీడియో కూడా చేశారు. ప్రజలు క‌రోనా నుండి ఎలా కాపాడుకోవాలో, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవ‌లో వివ‌రించిన విష‌యం తెలిసిందే. 

ఇక ప్ర‌తి ఏడాది ఘ‌నంగా జ‌రిగే హీరోల బర్త్ డేలు కూడా కరోనా కారణంగా ర‌ద్దు అవుతున్నాయి.  త‌మ బ‌ర్త్ డే వేడుక‌ల‌ని జ‌ర‌పొద్దంటూ హీరోలే స్వ‌యంగా  స్టేట్‌మెంట్స్ ఇస్తున్నారు. రీసెంట్‌గా మోహ‌న్ బాబు కూడా త‌న బ‌ర్త్‌డే వేడుక‌ల‌ని జ‌ర‌పొద్ద‌ని అభిమానులకు ట్విట్ చేశాడు. 

Also Read | ఫేస్ మాస్క్(Face Mask) కరోనా వైరస్ నుంచి కాపాడుతుందా? సైన్స్ ఏం చెబుతుంది