కరోనా కష్టం..పండ్లు అమ్ముకుంటున్న బాలీవుడ్ నటుడు : మళ్లీ పాత వృత్తే దిక్కైంది

  • Published By: nagamani ,Published On : May 22, 2020 / 09:44 AM IST
కరోనా కష్టం..పండ్లు అమ్ముకుంటున్న బాలీవుడ్ నటుడు : మళ్లీ పాత వృత్తే దిక్కైంది

లాక్‌డౌన్ ఆంక్షలతో కష్టాల కడగళ్లు ముంచెత్తున్నాయి. ఎన్నో రంగాల ఆర్థికాభివృద్ధి చతికిల పడింది. దీనికి సినీ ప‌రిశ్ర‌మ కూడా అతీతంకాదు. సినిమా థియేటర్లు మూత. ఆగిపోయిన షూటింగులు. పనిలేక రోడ్డున పడ్డ..కాదు కాదు ఇంటికే పరిమితమైన సినీ కార్మికులు..లాక్‌డౌన్ వ‌ల‌న షూటింగ్స్ అన్నీ బంద్ కావ‌డంతో కార్మికులకి ఉపాధి కరువైంది.

వేలాదిమంది కష్టాల్లోపడ్డారు.  దిక్కు తోచ‌ని పరిస్థితుల‌ల్లో కొట్టమిట్టాడుతున్నారు. ఈ కష్టాల్లో చిక్కుకున్న నటుబు సోలంకి దివాకర్ కూడా రోడ్డున పడ్డాడు. లాక్ డౌన్ కొద్దికొద్దిగా సడలిస్తున్న క్రమంలో బతుకుతెరువుకోసం తన పాత పనిలోపడ్డాడు. పండ్లు..కూరగాయలు అమ్ముకుంటున్నాడు. 

బాలీవుడ్ హీరో ఆయుష్మాన్ ఖురాన్ ప్ర‌ధాన పాత్రలో తెర‌కెక్కిన డ్రీమ్ గార్ల్ చిత్రంలో ముఖ్య పాత్ర పోషించిన న‌టుడు సోలంకి దివాక‌ర్‌. సినీ ఇండ‌స్ట్రీలోకి రాక‌ముందు ఆయ‌న పండ్లు, కూర‌గాయ‌లు అమ్ముకునేవాడు. నటన అంటే వల్లమాలిన ప్రేమతో సినీ పరిశ్రమవైపు వచ్చాడు. చిన్నా చితకా పాత్రలు వేస్తున్నాడు. ఇంతో లాక్ డౌన్ వ‌ల‌న షూటింగ్స్ అన్నీ బంద్ కావ‌డంతో తిరిగి పాత వృత్తినే కొన‌సాగిస్తున్నాడు. గ‌త రెండు నెల‌లుగా సోలంకి దివాకార్ పండ్లు అమ్ముకుంటూ కుటుంబానికి పోషించుకుంటున్నాడు. హ‌ల్క‌, హ‌వా, టిట్లీ, క‌డ్వి హ‌వా, సోంచారియా త‌దిత‌ర చిత్రాల‌లో సోలంకి న‌టించారు.

ఇటువంటి పరిస్థితుల్లో బతకటానికి ఏదోకటి చేయాల్సిన అవసరం ఉందని సోలంకి అంటున్నాడు. మనకు నచ్చిందే చేయాలనుకుంటూ కూర్చుంటే కుటుంబం గడిచేదెలా అందుకే పండ్లు అమ్మతున్నానంటున్నాడు. నటన అంటే తనకు ఎంతో ఇష్టమని..యూపీ వాసి అయిన సోలంకి దివాకర్ ఇండ్రస్ట్రీకి రాకముందు యూపీలోని ఓసినిమా థియేటర్ వద్ద పాపడ్స్ అమ్మేవాడు. అలా సినిమా థియేటర్ ముందు అమ్ముకునే క్రమంలో సినిమాల్లో నటించాలనే కోరిక పెంచుకున్నాడు. అలా నటన పట్ల ప్రేమ పెరిగిపోయి ఇండ్రస్ట్రీలోకి అడుగు పెట్టాడు.

సినిమాలో నటించటానికి కనీసం రూ.1000 ఇచ్చినా సరే పనిచేయటానికి రెడీ అయి వచ్చాడు. ఎలాగైతేనే నటుడయ్యాడు. తన పాత వృత్తిని మానేశాడు. కానీ కరోనా కష్టం తిరిగి సోలంకి దివాకర్ ని తన పాత వ్యాపారంవైపే నెట్టేసింది. మరి కరోనా కష్టం తీరి..తిరిగి సోలంకి సినిమాల్లో నటించాలనే ఆకాంక్షను వెల్లడించాడు. అతని కోరిక తీరాలనికోరుకుందాం…కష్టం ఎల్లకాలం ఉండిపోదు కదూ..అలాగే కరోనా మాత్రం ఎంతకాలం ఉంటుంది? మనిషి తలచుకోవాలనే కానీ ఇటువంటి కరోనాలు ఎన్ని వస్తేమాత్రం మనిషి ముందుకు సాగిపోవటాన్ని ఆపగలవా ఏంటీ..

Read:రాక్షసుడు డైరక్టర్‌తో రవితేజ సినిమా