Dulquer Salmaan : రామ్‌చరణ్‌ని ఫాలో అవుతున్న యశ్.. దుల్కర్ సల్మాన్ ట్వీట్!
ఈ మధ్య కాలంలో సినిమా రంగంలో ఉన్న హద్దులు చెరిగిపోయాయి. ఒక పరిశ్రమకే అంకితం అయిపోయిన హీరోలు అంతా పాన్ ఇండియా సినిమాలతో ఇప్పుడు ఇతర పరిశ్రమలోను మార్కెట్ క్రియేట్ చేసుకుంటున్నారు. ఈ క్రమంలోనే ఆఆ ఇండస్ట్రీ హీరోలు, ఫిలిం మేకర్స్ తో గుడ్ ఫ్రెండ్‌షిప్ ని మెయిన్‌టైన్ చేస్తున్నారు. టాలీవుడ్ లో ఈ పద్దతిని రామ్ చరణ్ బాగా ఫాలో అవుతుంటాడు.

Dulquer Salmaan : ఈ మధ్య కాలంలో సినిమా రంగంలో ఉన్న హద్దులు చెరిగిపోయాయి. ఒక పరిశ్రమకే అంకితం అయిపోయిన హీరోలు అంతా పాన్ ఇండియా సినిమాలతో ఇప్పుడు ఇతర పరిశ్రమలోను మార్కెట్ క్రియేట్ చేసుకుంటున్నారు. ఈ క్రమంలోనే ఆఆ ఇండస్ట్రీ హీరోలు, ఫిలిం మేకర్స్ తో గుడ్ ఫ్రెండ్‌షిప్ ని మెయిన్‌టైన్ చేస్తున్నారు. టాలీవుడ్ లో ఈ పద్దతిని రామ్ చరణ్ బాగా ఫాలో అవుతుంటాడు. ఈ క్రమంలోనే హైదరాబాద్ షూటింగ్ కి సల్మాన్ ఖాన్, యశ్ ఎప్పుడు వచ్చినా రామ్ చరణ్ తన ఇంటి నుంచి భోజనం పంపిస్తాడు.
Ram Charan : ఆయన్ని ఏమన్నా అంటే ఊరుకోము.. వాల్తేరు వీరయ్య స్టేజిపై రామ్ చరణ్ వార్నింగ్..
ఇదే పద్ధతిని ఇప్పుడు యశ్ కూడా ఫాలో అవుతున్నాడు. ‘సీతారామం’ హీరో దుల్కర్ సల్మాన్ కు యశ్ వింధు భోజనం ఏర్పాటు చేశాడట. నిన్న ట్విట్టర్ లో ఆడియన్స్ తో ఇంటరాక్ట్ అయ్యిన యశ్.. అభిమానులు అడిగిన ప్రశ్నలకు బదులిస్తూ వచ్చాడు. ఈ నేపథ్యంలోనే సీతారామంకి సీక్వెల్ రాబోతోందా? అని అడిగిన ఒక నెటిజెన్ ప్రశ్నకు బదులిస్తూ.. ఒకవేళ సీక్వెల్ వస్తే నేను నటించడానికి నా పాత్ర ఇంకా మిగిలి ఉందా? అంటూ సరదాగా బదులిచ్చాడు.
ఈ క్రమంలోనే యశ్ గురించి కొన్ని మాటలు చెప్పమని ఒక నెటిజెన్ అడగగా, దుల్కర్ బదిలిస్తూ.. ‘యశ్ చాలా మంచి వ్యక్తి. నాకు తనంటే చాలా ఇష్టం. నేను మైసూర్ లో షూటింగ్ చేస్తున్న సమయంలో నాకు, మా టీంకి మంచి వింధు భోజనం ఏర్పాటు చేశాడు’ అంటూ ట్వీట్ చేశాడు. ప్రస్తుతం ఈ ట్వీట్ నెట్టింట వైరల్ అవుతుంది. ఇక గత ఏడాది మాలీవుడ్ నుంచి బాలీవుడ్ వరకు ప్రతి ఇండస్ట్రీలో ఒక స్ట్రెయిట్ సినిమా చేసిన దుల్కర్.. దాదాపు అన్ని సినిమాలతో విజయాన్ని అందుకున్నాడు. ప్రస్తుతం ఈ హీరో ‘కింగ్ అఫ్ కోత’ అనే మలయాళ సినిమాలో నటిస్తున్నాడు. ఈ మూవీలో ఐశ్వర్య లక్ష్మి హీరోయిన్ గా నటిస్తుంది.
The kindest and best host. Sent me and my team more food than we could eat when we were both filming in Mysore. So much love for the Rocking Star !
— Dulquer Salmaan (@dulQuer) January 31, 2023