Eesha Guptha : అందంగా కనిపించాలని నటీమణులపై ఒత్తిడి.. అందుకు ఆ ఇంజెక్షన్ తీసుకోవాలంట..

ఈషా గుప్తా మాట్లాడుతూ.. ''ఇండస్ట్రీలో అడుగుపెట్టిన కొత్తలో చాలా మంది నన్ను ఎన్నో మాటలు అన్నారు. నా ముక్కు గుండ్రంగా ఉందని, దాన్ని షార్ప్‌గా కనిపించేలా చేసుకోమని.........................

Eesha Guptha : అందంగా కనిపించాలని నటీమణులపై ఒత్తిడి.. అందుకు ఆ ఇంజెక్షన్ తీసుకోవాలంట..

Eesha

Eesha Guptha :  బాలీవుడ్ నటి ఈషా గుప్తా సినిమాల్లో ఎంత హాట్ గా కనిపిస్తుందో బయట కూడా అలాగే కామెంట్స్ చేస్తూ వార్తల్లో నిలుస్తుంది. పలు బాలీవుడ్ సినిమాల్లో నటించిన ఈషా తెలుగులో కూడా ఒక సినిమా చేసింది. అంతే కాక రామ్ చరణ్ వినయ విధేయరామలో ఓ ప్రత్యేక గీతంలో కూడా నటించింది. ఇటీవలే ఆశ్రమ సిరీస్ లో కనిపించి మెప్పించింది ఈషా గుప్తా. ఇక తన సోషల్ మీడియాలో హాట్ హాట్ ఫోటోలని పోస్ట్ చేస్తూ అలరిస్తుంది. గత కొన్ని రోజులుగా ఏదో ఒక సంచలన వ్యాఖ్యలు చేసి వార్తల్లో నిలుస్తుంది.

తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో ఈషా గుప్తా మరో సంచలన వ్యాఖ్యలు చేసింది. హీరోయిన్స్, వారి అందం పై కామెంట్స్, వారిని ఎలా ట్రీట్ చేస్తారు అని మాట్లాడింది. ఈషా గుప్తా మాట్లాడుతూ.. ”ఇండస్ట్రీలో అడుగుపెట్టిన కొత్తలో చాలా మంది నన్ను ఎన్నో మాటలు అన్నారు. నా ముక్కు గుండ్రంగా ఉందని, దాన్ని షార్ప్‌గా కనిపించేలా చేసుకోమని, నా స్కిన్ బాగోలేదని, దాన్ని మెరిసిపోయేందుకు ఇంజక్షన్‌ తీసుకోమని… ఇలా రకరకాల మాటలు చెప్పారు. మొదట్లో నేను వాళ్ల మాటలు విని ఆ ఇంజక్షన్‌ కోసం ఆరా తీస్తే రూ.9000 ఉందని తెలిసింది. దాని పేరు నేను చెప్పను కానీ చాలామంది నటీమణులు ఫెయిర్‌ స్కిన్‌ కోసం ఆ ఇంజెక్షన్ తీసుకుంటున్నారు”

Nayan-Vignesh : పెళ్లి నుంచి డైరెక్ట్ గా తిరుమలకి నయన్-విగ్నేష్

”అందంగా కనిపించాలని నటీమణులపై చాలా ఒత్తిడి ఉంటుంది. నేను నా కూతురిని మాత్రం నటిగా అస్సలు చూడాలనుకోవడం లేదు. తను చిన్న వయసు నుంచే అందంగా కనిపించాలనే ఒత్తిడికి గురవడం నాకిష్టం లేదు. ఆమె చదువుకోకపోయినా పర్లేదు, కానీ గొప్ప క్రీడాకారిణి కావాలని అనుకుంటున్నాను” అని తెలిపింది. దీంతో హీరోయిన్స్ అందం కోసం ఇంజెక్షన్లు వాడతారు అన్న ఈషా మాటలు వైరల్ గా మారాయి.