స్వచ్ఛమైన భావోద్వేగాలతో ఏమై పోయావే

  • Published By: veegamteam ,Published On : January 2, 2020 / 05:59 AM IST
స్వచ్ఛమైన భావోద్వేగాలతో ఏమై పోయావే

సూపర్ హిట్ అయిన పాటలోని లైన్‌ని టైటిల్‌గా మార్చుకుని సూపర్ హిట్‌లు కొడుతున్నారు దర్శకులు. లేటెస్ట్‌గా మారుతీ దర్శకత్వంలో వచ్చిన సినిమా ప్రతి రోజు పండుగ రోజే.. ఈ సినిమా కూడా సూపర్ హిట్ సాంగ్ నుంచి వచ్చిన టైటిలే.

ఈ క్రమంలోనే ఇటీవల పడిపడి లేచెను మనస్సు సినిమాలో సూపర్ హిట్ పాట ఏమై పోయావే. ఆ పాటనే టైటిల్‌గా మార్చుకుని రాజీవ్ సిద్దార్ధ్,భ‌వాని చౌద‌రి, శాణు మజ్జారి హీరోహీరోయిన్లుగా మురళి దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కుతుంది. 

శ్రీ రామ్ క్రియేషన్స్, వి.యం స్టూడియోస్‌ పతాకాలపై హరి కుమార్ నిర్మాతగా తెరకెక్కుతున్నఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు ప్రస్తుతం జరుగుతున్నాయి. ఈ క్రమంలోనే సినిమాకు సంబంధించి దర్శకుడు మురళి మాట్లాడుతూ ..”మా `ఏమైపోయావే` చిత్ర యూనిట్ త‌ర‌పున అంద‌రికీ నూత‌న సంవ‌త్స‌ర శుభాకాంక్ష‌లు. ఏమైపోయావే ఒక స్వచ్ఛమైన భావోద్వేగ చిత్రం. మంచి కంటెంట్ తో ట్రై యాంగిల్ లవ్ స్టోరీ గా మీ ముందుకు రాబోతుంది. చిత్రీకరణ కొత్తగా ఉండి ఆడియన్స్ ని థ్రిల్ చేస్తుంది. అని చెప్పారు.

రాజీవ్ సిద్దార్ధ్, భ‌వాని చౌద‌రి. శాణు మజ్జారి కొత్తవారైనా వారి క్యారెక్ట‌ర్స్ కి యాప్ట్ అనిపించుకునేలా చ‌క్క‌గా న‌టించారు. మా నిర్మాత హరి కుమార్ గారు మేకింగ్ లో ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా నిర్మిస్తున్నారు. సినిమా అవుట్ పుట్ చాలా బాగా వస్తోంది. కంప్లీట్ మూవీని మీరు త‌ప్ప‌కుండా ఎంజాయ్ చేస్తార‌నే న‌మ్మ‌కం ఉంది.షూటింగ్ పూర్త‌య్యింది. పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ కార్య‌క్ర‌మాలు జ‌రుగుతున్నాయి. త్వ‌ర‌లోనే మీ ముందుకు తీసుకొని వ‌స్తామని అన్నారు.