F3 Movie: బుల్లితెరపై నవ్వులు పూయించేందుకు ఎఫ్3 రెడీ.. ఎప్పుడంటే..?

టాలీవుడ్‌లో కామెడీ ఫ్రాంచైజీగా ‘ఎఫ్3’ మూవీ ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేసిందో అందరికీ తెలిసిందే. గతంలో తెరకెక్కిన ఎఫ్2 చిత్రానికి సీక్వెల్‌గా ఎఫ్3 మూవీ వచ్చింది. ఈ సినిమాను దర్శకుడు అనిల్ రావిపూడి మరోసారి తనదైన మార్క్ ఎంటర్‌టైనింగ్ అంశాలతో నింపేశాడు.

F3 Movie: బుల్లితెరపై నవ్వులు పూయించేందుకు ఎఫ్3 రెడీ.. ఎప్పుడంటే..?

F3 Movie World Television Premiere On September 18

F3 Movie: టాలీవుడ్‌లో కామెడీ ఫ్రాంచైజీగా ‘ఎఫ్3’ మూవీ ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేసిందో అందరికీ తెలిసిందే. గతంలో తెరకెక్కిన ఎఫ్2 చిత్రానికి సీక్వెల్‌గా ఎఫ్3 మూవీ వచ్చింది. ఈ సినిమాను దర్శకుడు అనిల్ రావిపూడి మరోసారి తనదైన మార్క్ ఎంటర్‌టైనింగ్ అంశాలతో నింపేశాడు. ఈ సినిమాలో ఎఫ్2 మూవీలోని నటీనటులతో పాటు మరికొంత మంది కొత్తగా యాడ్ అయ్యారు. ఇక సమ్మర్ కానుకగా వచ్చిన ఈ సినిమాకు బాక్సాఫీస్ వద్ద బ్రహ్మాండమైన రెస్పాన్స్ దక్కింది.

F3: ఎఫ్3 ఓటీటీ డేట్ వచ్చేసిందోచ్!

ఈ సినిమాకు ట్రెమెండస్ రెస్పాన్స్ రావడంతో ఈ చిత్ర డిజిటల్, శాటిలైట్ రైట్స్ భారీ రేటుకు అమ్ముడుపోయాయి. ఇక ఇప్పటికే డిజిటల్ స్ట్రీమింగ్‌కు వచ్చేసిన ఎఫ్3, అక్కడ కూడా తనదైన మార్క్‌ను చూపించింది. కాగా, తాజాగా బుల్లితెరపై నవ్వులు పూయించేందుకు ఎఫ్3 మూవీ రెడీ అవుతోంది. ఈ సినిమా శాటిలైట్ రైట్స్‌ను ప్రముఖ ఛానల్ జీ తెలుగు సొంతం చేసుకుంది. దీంతో ఈ సినిమాను వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్‌గా సెప్టెంబర్ 18న సాయంత్రం 6 గంటలకు టెలికాస్ట్ చేసేందుకు నిర్వాహకులు రెడీ అవుతున్నారు.

Paruchuri comments on F3 : అసలు వెంకటేష్ F3 సినిమా ఎలా ఒప్పుకున్నాడో.. పరుచూరి గోపాలకృష్ణ వ్యాఖ్యలు..

మరి థియేటర్లు, ఓటీటీలో అదిరిపోయే రెస్పాన్స్ అందుకున్న ఎఫ్3 చిత్రం, బుల్లితెరపై ఎలాంటి రెస్పాన్స్‌ను అందుకుంటుందో చూడాలి. ఇక ఈ సినిమాలో విక్టరీ వెంకటేష్, వరుణ్ తేజ్, తమన్నా, మెహ్రీన్, సోనాల్ చౌహాన్‌లు ముఖ్య పాత్రల్లో నటించగా, దేవిశ్రీ ప్రసాద్ ఈ సినిమాకు సంగీతం అందించాడు.