Paruchuri comments on F3 : అసలు వెంకటేష్ F3 సినిమా ఎలా ఒప్పుకున్నాడో.. పరుచూరి గోపాలకృష్ణ వ్యాఖ్యలు..

పరుచూరి మాట్లాడుతూ.. ''వెంకటేష్ ని మురళి శర్మ కొడుకుగా చుపించాలనుకోవడం పెద్ద పొరపాటు, వెంకటేష్ వయసు ఎంతో మనకి తెలుసు అలాంటిది అలా ఎలా చుపించారో. సాధారణంగా వెంకటేష్ ఇలాంటి స్టుపిడ్ కథలని ఒప్పుకోరు. కానీ...........

Paruchuri comments on F3 : అసలు వెంకటేష్ F3 సినిమా ఎలా ఒప్పుకున్నాడో.. పరుచూరి గోపాలకృష్ణ వ్యాఖ్యలు..

Paruchuri gopalakrishna comments on f3 movie

Paruchuri comments on F3 :  వెంకటేష్, వరుణ్ తేజ్ హీరోలుగా గతంలో అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన F2 సినిమా భారీ విజయం సాధించింది. దీంతో ఆ సినిమాకి సీక్వెల్ కూడా ప్లాన్ చేసి F3 అని ఇటీవల రిలీజ్ చేశారు. అయితే ఈ సినిమాపై చాలానే విమర్శలు వచ్చాయి. కలెక్షన్స్ వచ్చినా సినిమాపై నెగిటివ్ కామెంట్స్ ఎక్కువగా వచ్చాయి. మేకర్స్ ఈ సినిమాని హిట్ అని చెప్పుకున్నా బయట మాత్రం యావరేజ్ టాక్ నడిచింది. ఇక F3 సినిమా విషయంలో డైరెక్టర్ అనిల్ రావిపూడిని బాగానే ట్రోల్ చేశారు నెటిజన్లు.

తాజాగా ఈ సినిమాపై, ఇలాంటి సినిమా వెంకటేష్ ఎందుకు ఒప్పుకున్నాడో అంటూ ప్రముఖ రచయిత పరుచూరి గోపాల కృష్ణ వ్యాఖ్యలు చేశారు. పరుచూరి పలుకులు అనే పేరుతో ఆయన యూట్యూబ్ ఛానల్ నడుపుతూ సినిమాల గురించి విశ్లేషిస్తూ ఉంటారు. తాజాగా పరుచూరి గోపాల కృష్ణ ఎఫ్3 సినిమాని విశ్లేషిస్తూ మాట్లాడిన వీడియోని రిలీజ్ చేశారు.

Meena : అలా ఉండుంటే నా భర్త బతికేవాడు.. అందుకే ఈ నిర్ణయం.. నటి మీనా ఎమోషనల్ పోస్ట్..

ఈ వీడియోలో పరుచూరి మాట్లాడుతూ.. ”వెంకటేష్ ని మురళి శర్మ కొడుకుగా చుపించాలనుకోవడం పెద్ద పొరపాటు, వెంకటేష్ వయసు ఎంతో మనకి తెలుసు అలాంటిది అలా ఎలా చుపించారో. సాధారణంగా వెంకటేష్ ఇలాంటి స్టుపిడ్ కథలని ఒప్పుకోరు. కానీ ఈ సినిమాకి ఎందుకు ఓకే చెప్పారో అర్థం కావడం లేదు. సెకండ్ హాఫ్ లో వెంకటేష్, వరుణ్ తేజ్ మురళిశర్మ కొడుకులుగా నమ్మించే ప్రయత్నం చేసే సన్నివేశాలు, తమన్నాకి మీసాలు పెట్టి అబ్బాయిలాగా చూపించడం లాంటివి ఏమాత్రం సెట్ అవ్వలేదు. ఎఫ్2 లో భార్య, భర్తల మధ్య ఉండే సాధారణ సమస్యలని ఫన్నీగా చూపించారు. ఆ మూవీలో ఒక సోల్ ఉంది. కానీ ఈ చిత్రంలో అంతా డబ్బు చుట్టూ చూపించారు. ఈ సినిమా వసూళ్లు సాధించింది అంటే అందుకు కారణం చివరి 20 నిమిషాలే” అని అన్నారు. దీంతో ఇప్పుడు ఈ వ్యాఖ్యలు వైరల్ గా మారాయి.

గతంలోనే ఇలాంటి సినిమాల్లో లాజిక్స్ వెతక్కుండా కేవలం నవ్వుకోడానికి రండి అని చెప్పాడు డైరెక్టర్ అనిల్ రావిపూడి. మరి పరుచూరి గోపాల కృష్ణ చేసిన వ్యాఖ్యలకు అనిల్ స్పందిస్తాడేమో చూడాలి.