Gautham Raju : ప్రముఖ సినిమా ఎడిటర్ గౌతమ్ రాజు కన్నుమూత.. విషాదంలో సినీ పరిశ్రమ..

గత కొంత కాలంగా గౌతంరాజు అనారోగ్యంతో బాధపడుతున్నారు. హాస్పిటల్ లో చికిత్స పొందుతూ మంగళవారం సాయంత్రం డిశ్చార్జ్ అయ్యారు. ఇంటికి వచ్చిన తర్వాత రాత్రి 1.30 గంటలకు మరణించారు. గౌతంరాజు మరణంతో...........

Gautham Raju : ప్రముఖ సినిమా ఎడిటర్ గౌతమ్ రాజు కన్నుమూత.. విషాదంలో సినీ పరిశ్రమ..

Gauthamraju

Gautham Raju :  సినిమాకి దర్శకుడు ఎంత ముఖ్యమో ఎడిటర్ కూడా అంతే ముఖ్యం. దర్శకుడు షూట్ చేసుకొచ్చిన సినిమాని కరెక్ట్ గా ఎడిట్ చేసి మంచి అవుట్ పుట్ ఇచ్చే బాధ్యత ఎడిటర్ దే. సినీ పరిశ్రమలో చాలా తక్కువ మంది ఎడిటర్స్ కి పేరొస్తుంది. అలాంటి ఫేమస్ ఎడిటర్స్ లో ఒకరు గౌతంరాజు . తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళం, హిందీ పరిశ్రమలో దాదాపు 800కి పైగా సినిమాలకి ఎడిటర్ గా పని చేశారు గౌతమ్ రాజు.

గత కొంత కాలంగా గౌతంరాజు అనారోగ్యంతో బాధపడుతున్నారు. హాస్పిటల్ లో చికిత్స పొందుతూ మంగళవారం సాయంత్రం డిశ్చార్జ్ అయ్యారు. ఇంటికి వచ్చిన తర్వాత రాత్రి 1.30 గంటలకు మరణించారు. గౌతంరాజు మరణంతో టాలీవుడ్ తో పాటు సౌత్ సినీ పరిశ్రమ ఒక్కసారిగా షాక్ కి గురయింది. ఎన్నో సంవత్సరాలుగా చాలా సినిమాలకు ఎడిటర్ గా పని చేస్తూ ఎన్నో సూపర్ హిట్స్ అందించి అవార్డులు, రివార్డులు కూడా అందుకున్నారు. ఇటీవల వచ్చిన సినిమాల్లో ఖైదీనెంబర్‌ 150, గబ్బర్‌సింగ్, కిక్, రేసుగుర్రం, గోపాల గోపాల, అదుర్స్, బలుపు, ఊసరవెల్లి, బద్రీనాథ్‌ లాంటి ఎన్నో సక్సెస్ సినిమాలకి గౌతమ్‌రాజు ఎడిటర్ గా పనిచేశారు.

Reddy Chittemma : ఆర్ నారాయణమూర్తికి మాతృ వియోగం

గౌతంరాజు మరణంతో టాలీవుడ్ లో విషాద ఛాయలు అలుముకున్నాయి. సెలబ్రిటీలు, సినీ ప్రముఖులు ఆయనకి నివాళులు అర్పిస్తున్నారు. సినీ ప్రముఖులు ఆయన ఇంటికి వెళ్లి సంతాపం తెలియచేస్తున్నారు.