Javed Akhtar And RSS : జావెద్ అక్తర్‌పై ఎఫ్ఐఆర్

ప్రముఖ రచయిత జావెద్ అక్తర్ పై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు ముంబై పోలీసులు. ఆర్ఎస్ఎస్ విషయంలో ఆయన పలు వివాదాస్పద వ్యాఖ్యలు చేసినట్లు ఆరోపణలున్నాయి.

Javed Akhtar And RSS : జావెద్ అక్తర్‌పై ఎఫ్ఐఆర్

Mumbai Ps

Lyricist Javed Akhtar : ప్రముఖ రచయిత జావెద్ అక్తర్ పై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు ముంబై పోలీసులు. ఆర్ఎస్ఎస్ విషయంలో ఆయన పలు వివాదాస్పద వ్యాఖ్యలు చేసినట్లు ఆరోపణలున్నాయి. ఈ వ్యాఖ్యలపై ముంబైకి చెందిన న్యాయవాది సంతోష్ దూబే ఫిర్యాదు చేశారు. ఈ మేరకు ములుంద్ పీఎస్ లో ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. తాము గతంలోనే…జావెద్ అక్తర్ కు లీగల్ నోటీసు పంపామని, చేసిన వ్యాఖ్యలపై క్షమాపణలు చెప్పాలని కోరడం జరిగిందన్నారు.

Read More : Lars Wilkes : మహ్మద్ ప్రవక్తపై అభ్యంతర కార్టూన్ వేసిన వ్యక్తి దుర్మరణం

అయితే..నోటీసుకు ఎలాంటి స్పందన రాలేదని, ఈ మేరకు పోలీసులకు ఫిర్యాదు చేయడం జరిగిందన్నారు. ఐపీసీ సెక్షన్ 500 కింద పరువు నష్టం కేసు నమోదు చేసినట్లు పోలీసు అధికారి వెల్లడించారు. ఆర్ఎస్ఎస్ పై పలు అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారు జావెద్ అక్తర్. తాలిబన్లు ఏ విధంగా ఇస్లామిక్ రాజ్యం కోసం పోరాడుతున్నారో…అదే విధంగా హిందూ దేశస్థాపన కోసం ఆర్ఎస్ఎస్ పని చేస్తోందన్న వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. ఈ వ్యాఖ్యలపై బీజేపీతో పాటు…శివసేన సైతం ఆగ్రహం వ్యక్తం చేసింది. దీనిపై పరువు నష్టం దావాపై థానే కోర్టు షోకాజ్ నోటీసు జారీ చేసింది.