Raveena Tandon : పులిని వీడియో తీసి చిక్కుల్లో పడ్డ బాలీవుడ్ భామ..

ఇటీవల రవీనా టాండన్ మధ్యప్రదేశ్‌లోని సాత్పురా టైగర్ రిజర్వులో టూర్ కి వెళ్లారు. అక్కడ జీపులో ప్రయాణిస్తూ పులులని వీడియోలు తీశారు. ఈ క్రమంలో వారు పులికి మరింత దగ్గరికి వెళ్లి వీడియోలు తీశారు. అనంతరం ఆ వీడియోల్ని తన సోషల్ మీడియాలో............

Raveena Tandon : పులిని వీడియో తీసి చిక్కుల్లో పడ్డ బాలీవుడ్ భామ..

Forest officers send notices to Raveena Tandon

Raveena Tandon :  కొంతమందికి వైల్డ్ లైఫ్ ఫోటోగ్రఫి అంటే చాలా ఇష్టం. అడవుల్లోకి వెళ్లి పక్షులని, జంతువులని వీడియోలు, ఫోటోలు తీస్తూ ఉంటారు. వైల్డ్ లైఫ్ ఫోటోగ్రఫి అంటే ఇష్టం ఉన్న పలువురు సెలబ్రిటీలు కూడా అప్పుడప్పుడు కెమెరాలు పట్టుకొని అడవుల్లోకి వెళ్తారు. తాజాగా బాలీవుడ్ భామ రవీనా టాండన్ ఓ పులిని వీడియో తీసి చిక్కుల్లో పడింది.

ఇటీవల రవీనా టాండన్ మధ్యప్రదేశ్‌లోని సాత్పురా టైగర్ రిజర్వులో టూర్ కి వెళ్లారు. అక్కడ జీపులో ప్రయాణిస్తూ పులులని వీడియోలు తీశారు. ఈ క్రమంలో వారు పులికి మరింత దగ్గరికి వెళ్లి వీడియోలు తీశారు. అనంతరం ఆ వీడియోల్ని తన సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా అవి వైరల్ గా మారాయి. దీంతో ఫారెస్ట్ అధికారులు ఆమెపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఆమెకి నోటీసులు పంపారు.

Adivi Sesh : రిచా పెట్టిన ట్వీట్ నన్ను చాలా బాధపెట్టింది..

పులికి అంత దగ్గరగా వెళ్లినందుకు, ఆ ఫోటోలు, వీడియోలు షేర్ చేసినందుకు రవీనా టాండన్ తో పాటు ఆమె వాహనం డ్రైవర్ కి, అక్కడ ఉన్న అధికారులకి కూడా నోటీసులు ఇచ్చారు. దీనిపై వివరణ ఇవ్వాలని లేకపోతే చట్టపరంగా చర్యలు తప్పవు అని తెలిపారు. దీంతో ఆ వీడియోల్ని తన సోషల్ మీడియా నుంచి డిలీట్ చేసింది రవీనా. అయితే దీనికి రవీనా టాండన్ స్పందిస్తూ.. ఒక సెలబ్రిటీ వైల్డ్ లైఫ్ టూరిజంని ప్రమోట్ చేస్తున్నందుకు ఆనందించకపోగా ఇలాంటి పనులు చేస్తున్నారు అంటూ వరుస ట్వీట్స్ చేసింది.