Telugu Upcoming Films: ఫుల్ బిజీగా ఫెస్టివల్ సీజన్.. టఫ్ ఫైట్ తప్పేలా లేదు!

పండగలన్నీ ఫుల్ బిజీ అయిపోయాయి. సీజన్ చూసుకుని మరీ సినిమాలు రిలీజ్ చేస్తున్న మన స్టార్లు.. వరుసగా దసరా, దీపావళి, క్రిస్ మస్, సంక్రాంతి ఇలా వరుసగా అన్ని ఫెస్టివల్స్ ని ..

Telugu Upcoming Films: ఫుల్ బిజీగా ఫెస్టివల్ సీజన్.. టఫ్ ఫైట్ తప్పేలా లేదు!

Telugu Upcoming Films

Telugu Upcoming Films: పండగలన్నీ ఫుల్ బిజీ అయిపోయాయి. సీజన్ చూసుకుని మరీ సినిమాలు రిలీజ్ చేస్తున్న మన స్టార్లు.. వరుసగా దసరా, దీపావళి, క్రిస్ మస్, సంక్రాంతి ఇలా వరుసగా అన్ని ఫెస్టివల్స్ ని బుక్ చేసుసుకుంటున్నారు. ఆల్రెడీ పండగ బరిలో దిగుతున్నామని ఎప్పుడో అనౌన్స్ చేసిన సినిమాలతో పాటు మరికొన్ని సినమాలు కూడా యాడ్ అయ్యి పెస్టివల్ ఫైట్ ని టఫ్ చేస్తున్నాయి.

Big Boss 5: కాస్త ఎమోషన్..ఇంకాస్త రొమాంటిక్‌.. ప్రేమ పక్షుల గోరుముద్దలు!

స్టార్ హీరో సినిమా రిలీజ్ అవుతుందంటే మిగతా వాళ్లు అప్పుడు కాకుండా కాస్త ముందో, వెనకో రిలీజ్ పెట్టుకునేవాళ్లు. కానీ ఇప్పుడు మాత్రం తమ్ముడు తమ్ముడే.. పేకాట పేకాటే అన్నట్టు.. ఒకే సీజన్ లోనే.. ఆల్ మోస్ట్ అటూ ఇటూగా సినిమాలు రిలీజ్ చేస్తున్నారు. స్పెషల్లీ రాబోతున్న దసరాకి ఆల్రెడీ ధియేటర్లు ఖర్చీఫ్ లు వేసేసుకున్నారు హీరోలు. లేటెస్ట్ గా రాఘవేంద్రరావు పెళ్లి సందడి సినిమాతో పాటు.. బాలయ్య, బోయపాటి హ్యట్రిక్ మూవీ అఖండ కూడా దసరా బరిలోకే రెడీ అవుతోంది.

Samantha-Naga Chaitanya: విలన్ షేడ్స్ చూపిస్తున్న చై-సామ్!

దసరా సీజన్ లో రిలీజ్ అవుతున్న సినిమాలు కొండపొలం, మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్. వైష్ణవ్ తేజ్, రకుల్ జంటగా వస్తున్న కొండపొలంతో పాటు అఖిల్, పూజాహెగ్డే జంటగా వస్తున్న లవ్ రొమాంటిక్ మూవీ మోస్ట్ ఎలిజిబుల్ ట్యాచిలర్ దసరా సీజన్ లోనే అక్టోబర్ 8న రిలీజ్ అవుతోంది. విజయదశమి రిలీజ్ కు రెడీ అవుతున్న మరో సినిమా మహాసముద్రం.. శర్వానంద్, సిద్దార్డ్ లీడ్ రోల్స్ లో యాక్షన్ లవ్ డ్రామాగా అజయ్ భూపతి డైరెక్షన్లో తెరకెక్కిన ఈ సినిమా అక్టోబంర్ 14న రిలీజ్ డేట్ అనౌన్స్ చేసింది.

Evaru Meelo Koteeswarulu: హీరోలంతా ఒక్కటే.. అందరినీ గేదర్ చేస్తున్న తారక్!

దసరా అవ్వకుండానే దీపావళి సందడి స్టార్ట్ చేసేశారు. దసరా ఆల్రెడీ ఆక్యుపై అవ్వడంతో చిరంజీవి, చరణ్ లీడ్ రోల్స్ లో కొరటాల శివ చేస్తున్న ఆచార్య సినిమాని దీపావళికి రిలీజ్ చేద్దామని ప్లాన్ చేస్తున్నారు. వీళ్లతో పాటు మరో మెగా హీరో వరుణ్ తేజ్ బాక్సింగ్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కుతున్న గని సినిమాని నవంబర్ 3న రిలీజ్ చెయ్యడానికి రెడీ అయ్యారు. ఇక సౌత్ స్టార్ హీరో రజనీకాంత్ అయితే దీపావళి నవంబర్ 4న ధియేటర్లోకి నేనొస్తున్నాఅంటూ అఫీషియల్ గా అనౌన్స్ చేసేశారు.

Bigg Boss 5: ఎలిమినేషన్‌లో ఐదుగురు.. లహరికి డేంజర్ తప్పదా?

తెలుగు పండగలే కాకుండా సినిమా రిలీజ్ లకు క్రిస్ మస్ ని వాడేస్తున్నారు మనవాళ్లు . సౌత్ మోస్ట్ అవెయిటింగ్ మూవీస్ పుష్ప, ఏజెంట్ సినిమాలు క్రిస్ మస్ కే డేట్ ఫిక్స్ చేసుకున్నాయి. అఖిల్ హీరోగా సురేందర్ రెడ్డి డైరెక్షన్లో తెరకెక్కుతున్న యాక్షన్ డ్రామా ఏజెంట్ సినిమాతో పాటు , అల్లు అర్జున్ ప్యాన్ ఇండియా లెవల్లో సుకుమార్ డైరెక్షన్లో చేస్తున్న క్రేజీ మూవీ పుష్పఫస్ట్ పార్ట్ డిసెంబర్ 24న రిలీజ్ డేట్ అనౌన్స్ చేసింది.