Gautham Vasudev Menon : ఏ మాయ చేసావే కథ మొదట మహేష్‌కి చెప్పాను.. కానీ..
గౌతమ్ వాసుదేవ్ మీనన్ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ''ఏ మాయ చేశావే స్టోరీని ముందు తమిళంలో తీయాలని అనుకున్నాను. కాకపోతే ఆ కథను మహేష్ బాబుకు వినిపించాలని ముందు మంజుల గారికి చెప్పాను. మహేష్ నో చెప్తాడు కాకపోతే ఒకసారి చెప్పి చూడు అని............

Gautham Vasudev Menon narrated Ye Maya Chesave Story first to Mahesh Babu
Gautham Vasudev Menon : డైరెక్టర్ గౌతమ్ వాసుదేవ్ మీనన్ తమిళ్ సినిమాలతో పాటు, తెలుగులో ఘర్షణ, ఏమాయ చేసావే లాంటి సినిమాలతో మెప్పించారు. ఓ పక్క వరుసగా సినిమాలని తెరకెక్కిస్తూనే, మరోపక్క నటుడిగా కూడా బిజీగా ఉన్నారు. అయన సినిమాలకి చాలా మంది అభిమానులు ఉన్నారు. ఆయన సినిమాల్లో లవ్ స్టోరీస్, థ్రిల్లర్స్ కలిపి సరికొత్తగా తెరకెక్కిస్తారు. లవ్, సస్పెన్స్ థ్రిల్లర్ జోనర్స్ లో ఆయన చాలా స్పెషల్.
గౌతమ్ వాసుదేవ్ మీనన్ ప్రస్తుతం శింబు హీరోగా, సిద్ది ఇదాని హీరోయిన్ గా ‘వెందు తనిందదు కాడు’ అనే సినిమాని తెరకెక్కించారు. తెలుగులో ఈ సినిమా ‘ది లైఫ్ ఆఫ్ ముత్తు’ పేరుతో రిలీజ్ అయింది. ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ఓ ఇంటర్వ్యూలో గౌతమ్ వాసుదేవ్ మీనన్ ఓ ఆసక్తికర విషయాన్ని తెలియచేశారు. నాగచైతన్య, సమంత జంటగా అయన దర్శకత్వంలో తెరకెక్కిన ఏం మాయ చేసావే సినిమా మంచి విజయం సాధించింది. అయితే ఈ స్టోరీ మొదట మహేష్ కి చెప్పారట.
Alluri Movie Pre Release Event : అల్లూరి సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ గ్యాలరీ
దీనిపై గౌతమ్ వాసుదేవ్ మీనన్ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ”ఏ మాయ చేశావే స్టోరీని ముందు తమిళంలో తీయాలని అనుకున్నాను. కాకపోతే ఆ కథను మహేష్ బాబుకు వినిపించాలని ముందు మంజుల గారికి చెప్పాను. మహేష్ నో చెప్తాడు కాకపోతే ఒకసారి చెప్పి చూడు అని మంజుల చెప్పింది. నేను వెళ్లి మహేష్ గారికి ఏ మాయ చేసావే కథ చెప్పాను. మహేష్ కథ విని ఇది చాలా చిన్న స్టోరీ కదా. మన ఇద్దరం కలిసి చేస్తున్నామంటే అంచనాలు వేరేలా ఉంటాయి. ఏదైనా యాక్షన్ ఫిలిం, చాలా పెద్ద ఫిలిం చేద్దాం అని అన్నారు. ఆ తర్వాత ఏ మాయ చేసావే కథని నాగచైతన్య దగ్గరికి తీసుకెళ్ళాను” అని తెలిపారు. ఈ సంగతి తెలుసుకొని మహేష్ బాబు ఓ క్లాసిక్ లవ్ స్టోరీ మిస్ చేసుకున్నాడని అభిమానులు, నెటిజన్లు స్పందిస్తున్నారు.
GVM tho chesi untey atleast oka decent film chesa ane peru migiledi kada anna @urstrulyMahesh ???
Nanna Muruga Nolan ??? pic.twitter.com/qozrGjVAU8— Jim Halpert (@jiimhalpert) September 18, 2022