RRR: బామ్మ ‘నాటు’ డాన్స్.. కేకో కేక..!

ఇప్పుడు ఎక్కడ విన్నా నాటు నాటు నాటు.. ఇదే ఇప్పుడు తెలుగు సినీ ప్రేక్షకులన ఊపేస్తున్న పదం.. పాట. యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రాంచరణ్ కలసి నటిస్తున్న భారీ బడ్జెట్ యాక్షన్..

RRR: బామ్మ ‘నాటు’ డాన్స్.. కేకో కేక..!

Rrr

RRR: ఇప్పుడు ఎక్కడ విన్నా నాటు నాటు నాటు.. ఇదే ఇప్పుడు తెలుగు సినీ ప్రేక్షకులన ఊపేస్తున్న పదం.. పాట. యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రాంచరణ్ కలసి నటిస్తున్న భారీ బడ్జెట్ యాక్షన్ చిత్రం ఆర్ఆర్ఆర్ ఎప్పుడెప్పుడు ప్రేక్షకుల ముందుకొస్తుందా అని కోటి ఆశలతో ఎదురుచూస్తున్నారు. దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న ఈ మరో విజువల్ వండర్.. జనవరి 7న రిలీజ్ కు రెడీ అవుతుండడంతో చిత్ర యూనిట్ భారీ ప్రచార కార్యక్రమాలు షురూ చేసింది. కొన్ని రోజుల క్రితం విడుదల చేసిన గ్లింప్స్ వీడియోకి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చిన సంగతి తెలిసిందే.

RRR: జక్కన్న నాటు ప్రమోషన్స్.. దెబ్బకి సోషల్ మీడియా షేక్!

కాగా.. తాజాగా విడుదల చేసిన నాటు నాటు డాన్స్ లిరికల్ సాంగ్ వీడియో అయితే సోషల్ మీడియాలో దుమ్ములేపుతుంది. ఇటు సెలబ్రిటీలు సైతం ఈ సినిమా ఎప్పుడొస్తుందా అని ఉత్కంఠ తట్టుకోలేకపోతున్నామని ట్వీట్లు, పోస్టులు పెడుతుంటే.. సామాన్య ప్రేక్షకులైతే ఈ పాటకి స్టెప్పులేస్తూ ఫుల్ జోష్ నింపుతున్నారు. ఈ పాటకి చిన్నా పెద్ద తేడా లేకుండా డాన్స్ చేస్తూ ఆ వీడియోలు సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తుండడంతో సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా ఈ పాటే వినిపిస్తుంది.. కనిపిస్తుంది.

RRR Glimpse : ఎన్టీఆర్ – చరణ్ ఫ్యాన్స్ థియేటర్లలో సీట్లు చింపే సీన్ ఇదేనేమో?

తాజాగా నాటు నాటు పాటకి ఓ బామ్మ అద్దిరిపోతే స్టెప్పులేసింది. ఏ మాత్రం అలసట లేకుండా ఈ వయసులో కూడా దుమ్ములేపే స్టెప్పులేసి ఈ బామ్మ చరణ్, ఎన్టీఆర్ స్టెప్పులతో సమానంగా అదరగొట్టింది. బామ్మ నాటు డాన్స్ వీడియోన ఆర్ఆర్ఆర్ సోషల్ మీడియా ఖాతాలతో షేర్ చేయడంతో ఇప్పుడు ఈ వీడియో కూడా వైరల్ గా మారింది. ఈ వయసులో ఇంత ఉత్సాహమా అని ఆర్ఆర్ఆర్ టీం రెచ్చ లేపింది. మొత్తంగా ఈ బామ్మ డాన్స్ చూస్తే ఎవరైనా కేకో కేక అనాల్సిందే.