Hameeda : నాకు కావాల్సిన ప్రేమ శ్రీరామ్ దగ్గర దొరికింది.. కానీ.. : హమీదా

మొన్నటి ఎపిసోడ్ లో అయిదవ కంటెస్టెంట్ హమీదా ఎలిమినేట్ అయింది. ఎలిమినేట్ అయిన వాళ్ళతో బిగ్ బాస్ బజ్ అనే పేరుతో ఇంటర్వ్యూలు తీసుకుంటారు. ఈ సారి

10TV Telugu News

Hameeda :  బిగ్ బాస్ గొడవలతో, కొట్లాటలతో, లవ్ ట్రాక్స్ తో సాగిపోతుంది. బిగ్ బాస్ 5 తెలుగు సీజన్ మొదలై ఇప్పటికే అయిదు వారాలైపోయింది. ఇప్పటికే నలుగురు ఎలిమినేట్ అయ్యారు. తాజాగా మొన్నటి ఎపిసోడ్ లో అయిదవ కంటెస్టెంట్ హమీదా ఎలిమినేట్ అయింది. ఎలిమినేట్ అయిన వాళ్ళతో బిగ్ బాస్ బజ్ అనే పేరుతో ఇంటర్వ్యూలు తీసుకుంటారు. ఈ సారి ఈ ఇంటర్వ్యూలు గత సీజన్ కంటెస్టెంట్ అరియనా చేస్తుంది. ఎలిమినేట్ అయిన వాళ్ళు హౌస్ లో తమ అనుభవాలని ఈ ఇంటర్వ్యూ ద్వారా షేర్ చేసుకుంటారు. ఈ ఇంటర్వ్యూలో హమీదా చాలా ఇంటరెస్టింగ్ విషయాలు షేర్ చేసుకుంది.

హౌస్ లో శ్రీరామచంద్రతో ఎక్కువ సమయాన్ని కేటాయించడం వల్ల తాను టాస్క్‌లపై ఎక్కువ దృష్టి పెట్టలేకపోయానని అందుకే నేను ఎలిమినేట్ అయి ఉండొచ్చండి హమీదా తెలిపింది. ఇక హమీదాకి క్లోజ్ అయిన శ్రీరామ్ గురించి మాట్లాడుతూ.. నేను శ్రీరామచంద్ర లవర్స్ కాదు. మా మధ్య మంచి రిలేషన్‌షిప్‌ ఉంది. నేను ఏదైతే ప్రేమ కావాలనుకుంటున్నానో అది శ్రీరామ్‌ దగ్గర నుంచి నాకు లభించింది. తను నన్ను ఎంతో ప్రేమగా చూసుకునేవాడు. మేమిద్దరం అన్ని విషయాలు షేర్‌ చేసుకునే వాళ్లం. హౌస్‌ నుంచి ఎలిమినేట్‌ అయి బయటకు వచ్చే ముందు రోజు రాత్రి కూడా నేను తనతోనే ఎక్కువసేపు మాట్లాడుతూ ఉండిపోయాను అని శ్రీరామ్ గురించి చెప్పింది.

Manchu Vishnu : ‘మా’ అధ్యక్షుడిగా విష్ణు తొలి సంతకం ఈ ఫైల్ పైనే…

ఇక హౌస్ లో అక్కడున్న టైటిల్స్ తో ఒక్కొక్కరికి ఒక్కో బిరుదు ఇవ్వమని అరియనా అడగగా శ్రీరామ్ గురించి చెప్తూ తనలో చాలా షేడ్స్‌ ఉన్నాయి. ఒక్కొసారి ఒక్కొలా ప్రవర్తిస్తాడు. అందుకే శ్రీరామ్ కి చంద్రముఖి అని టైటిల్‌ ఇవ్వాలని ఉంది. కానీ ఆ టైటిల్ ఇక్కడ లేదు కాబట్టి హిట్లర్‌ ఇస్తాను. ఎందుకంటే గడిచిన రెండు వారాలుగా శ్రీరామ్ చాలా కోపంగా ఉంటున్నాడు నాతో కూడా కోపంగా ప్రవర్తించాడు అని తెలిపింది హమీద.

ఇక హౌస్ లో మిగిలిన వాళ్ళకి కూడా టైటిల్స్ ఇచ్చింది హమీదా. సన్నీకి మిస్టర్‌ మజ్ను అని, సిరి ప్రతి విషయంలో చిన్న పిల్లలా వ్యవహరిస్తుంది కాబట్టి చిన్నపిల్ల అని, రవి మంచి చెడులు చెబుతూ ఉంటాడు. నేను అన్నయ్య అని పిలుస్తాను కాబట్టి రవికి మంచి మనిషి అనే టైటిల్ ని, శ్వేతా ఏదైనా సరే పోరాటం చేయాలి అంటుంది కాబట్టి వారియర్ అని, ఉమా కూడా మంచి మనిషి అని, కాజల్‌ ఫేక్‌ స్టార్‌, ఓవర్‌ థింకర్‌ ఎదుకంటే నేను ఆమెను అక్కగా భావించి చాలా విషయాలు షేర్‌ చేశాను. కానీ ఆమెది ఫేక్‌ రిలేషన్‌షిప్‌ అని కొన్ని టాస్క్‌ల తర్వాత అర్థమైంది అని తెలిపింది.

MAA Elections 2021 : విష్ణుని ఎవరైనా డిస్టర్బ్ చేస్తే బాగోదు : నరేష్

విశ్వ చేతులకు గాయాలైన సరే టాస్క్‌లో పోటీ చేస్తానని ముందుకు వచ్చాడు కాబట్టి రెబెల్ అని, నటరాజ్‌ మాస్టర్ వంటగదిలో ప్రతి వంట ఆయనే చేయాలనుకుంటాడు కాబట్టి వంటలక్క అని, మానస్‌ మిస్టర్‌ పర్‌ఫెక్ట్‌ అని, సరయు నాకు మంచి స్నేహితురాలు కాబట్టి స్వీట్‌ అని, ప్రియాంక నాన్‌ వెజ్‌ వంటలన్నీ తనే చేయాలనుకుంటుంది. నాకు కోపం తెప్పించాలని శ్రీరామ్‌తో కాస్త చనువుగా ప్రవర్తిస్తుండేది అందుకే నోటంకి, వంటలక్క, అల్లరిపిల్ల అని టైటిల్ ఇస్తాను అంది. ఇక ప్రియ హౌస్‌లో అందరితో బాగానే ఉంటున్నట్టే ఉంటుంది. కానీ కొన్నిసార్లు ఫిట్టింగ్‌లు కూడా పెడుతుంది కాబట్టి ఫిట్టింగ్‌ మాస్టర్‌ అని, జెస్సీ పిల్ల బచ్చా అని, షన్ను పెదరాయుడు అని, హౌస్‌లో ఉన్నన్ని రోజులు ‘అమ్మ’ గుర్తుకువచ్చిన ప్రతిసారీ అనీ మాస్టర్‌ని హత్తుకునేదాన్ని. ఆమె చాలా సేఫ్‌గా గేమ్‌ ఆడుతుంది కాబట్టి సేఫ్‌ ప్లేయర్‌ అని, ఇక లోబో ఫుటేజ్‌ మాస్టర్‌ అని ఇలా ఇంట్రెస్టింగ్ టైటిల్స్ ఇచ్చింది హమీదా.