SaiDharam Tej : చేతిలోనే చెయ్యేసి.. సాయి ధరమ్ తేజ్ తో హరీష్ శంకర్

తాజాగా సాయి ధ‌ర‌మ్ తేజ్ ను ద‌ర్శ‌కుడు హ‌రీశ్ శంక‌ర్ ఇంటికి వెళ్లి క‌లిశాడు. సాయి ధ‌ర‌మ్ తేజ్‌, హ‌రీశ్ శంక‌ర్ కాంబినేష‌న్‌లో గ‌తంలో 'సుబ్ర‌మ‌ణ్యం ఫ‌ర్ సేల్' సినిమా చేశారు.

SaiDharam Tej : చేతిలోనే చెయ్యేసి.. సాయి ధరమ్ తేజ్ తో హరీష్ శంకర్

Hareesh

SaiDharam Tej :  మెగా హీరో సాయి ధ‌ర‌మ్ తేజ్ యాక్సిడెంట్ అయి చాలా రోజులు హాస్పిటల్ లోనే ఉండి ఇటీవల దసరా రోజే డిశ్చార్జ్ అయిన సంగతి తెలిసిందే. ఆ రోజు మెగా ఫ్యామిలీ మరియు సినీ ప్రముఖులు సాయి ధరమ్ తేజ్ పై ట్వీట్స్ చేశారు. డిశ్చార్జ్ అయినా ఇంకొన్ని రోజులు రెస్ట్ తీసుకోవాలి అనడంతో ప్రస్తుతం సాయి ధరమ్ తేజ్ ఇంటి దగ్గరే రెస్ట్ తీసుకుంటున్నారు. ఇంటి ద‌గ్గ‌ర విశ్రాంతి తీసుకుంటున్న సాయి ధ‌ర‌మ్ తేజ్‌ను కొంతమంది సెల‌బ్రెటీలు ఇంటికి వెళ్లి పలకరిస్తున్నారు.

Nagababu : నాగబాబుకి కౌంటర్ వేసిన ‘కోటా’.. చిరంజీవి లేకపోతే నాగబాబు ఎవరో కూడా తెలీదు..

తాజాగా సాయి ధ‌ర‌మ్ తేజ్ ను ద‌ర్శ‌కుడు హ‌రీశ్ శంక‌ర్ ఇంటికి వెళ్లి క‌లిశాడు. సాయి ధ‌ర‌మ్ తేజ్‌, హ‌రీశ్ శంక‌ర్ కాంబినేష‌న్‌లో గ‌తంలో ‘సుబ్ర‌మ‌ణ్యం ఫ‌ర్ సేల్’ సినిమా చేశారు. సాయి తేజ్ ని కలిసిన సంద‌ర్భంగా ఒక ఫొటోను పోస్టు చేశాడు. నా త‌మ్ముడు సాయి ధ‌ర‌మ్ తేజ్ ఇప్పుడు సూప‌ర్ ఫిట్‌గా క‌నిపిస్తున్నాడు. ఫుల్లీ.. మ‌ళ్లీ లోడెడ్ అంటూ సాయి ధరమ్ తేజ్ చేతిలో చేయి క‌లిపి ఉన్న ఫొటోను హ‌రీశ్ శంక‌ర్ పోస్టు చేశాడు. ఇప్పుడు ఈ ఫొటో వైర‌ల్‌గా మారింది. అయితే యాక్సిడెంట్ అయిన దగ్గరనించి ఇప్పటిదాకా సాయిధరమ్ తేజ్ ఫేస్ చూపించలేదు. సాయితేజ డిశ్చార్జ్ అయ్యేటప్పుడు కూడా ఓకే సింబల్ చూపించి ట్వీట్ చేశాడు. ఇప్పుడు కూడా ఓన్లీ చేతులే ఫోటో తీసి షేర్ చేశారు. సాయి తేజ్ ఎప్పుడు కనిపిస్తాడా అని అభిమానులు వెయిట్ చేస్తున్నారు. సాయి తేజ్ షూటింగ్స్ స్టార్ట్ చేయాలి అంటే మరింత టైం పట్టేలా కనిపిస్తుంది.