Nithin : హీరో నితిన్ వైఫ్‌కి కరోనా.. దూరం దూరంగా బర్త్‌డే సెలబ్రేషన్స్

నితిన్ ఇవాళ ఉదయం ట్విట్టర్ లో ఓ ట్వీట్ చేశాడు. ఇవాళ తన వైఫ్ బర్త్ డే సందర్భంగా సెలెబ్రేషన్ చేద్దామనుకున్నాడు కానీ తన వైఫ్ కి కరోనా రావడంతో వాళ్ళ ఇంట్లో పైన ఒక రూమ్ లో..........

Nithin :  హీరో నితిన్ వైఫ్‌కి కరోనా.. దూరం దూరంగా బర్త్‌డే సెలబ్రేషన్స్

Nithin

Nithin :   ఇటీవల రోజు రోజుకి మళ్ళీ కరోనా కేసులు పెరుగుతున్నాయి. ఈ సారి సెలబ్రిటీలని గట్టిగానే టార్గెట్ చేసింది కరోనా. సెకండ్ వేవ్ కంటే కూడా ఈ సారి ఎక్కువ మంది సెలబ్రిటీలు కరోనా బారిన పడుతున్నారు. ఇటీవల బాలీవుడ్ లో స్టార్ హీరో, హీరోయిన్స్ అంతా కరోనా బారిన పడ్డారు. ఇక టాలీవుడ్ లోను చాలా మంది సెలబ్రిటీలు కరోనా బారిన పడ్డారు. ఇప్పటికే మంచు మనోజ్, మంచు లక్ష్మి, మహేష్ బాబు… ఇలా చాలా మంది సెలబ్రిటీలు కరోనా బారిన పడ్డారు. తాజాగా
హీరో నితిన్ వైఫ్ కూడా కరోనా బారిన పడింది.

నితిన్ ఇవాళ ఉదయం ట్విట్టర్ లో ఓ ట్వీట్ చేశాడు. ఇవాళ తన వైఫ్ బర్త్ డే సందర్భంగా సెలెబ్రేషన్ చేద్దామనుకున్నాడు కానీ తన వైఫ్ కి కరోనా రావడంతో వాళ్ళ ఇంట్లో పైన ఒక రూమ్ లో తన వైఫ్ ఉండటంతో ఆమె కిటికి లోంచి చూస్తూ ఉంటే కింద గార్డెన్ ఏరియాలో నితిన్ తన కుటుంబ సభ్యులతో కేక్ కట్ చేసి విషెష్ తెలియచేశాడు. కింద నుంచే కేక్ చూపించి తిను అన్నట్లు చెప్పాడు నితిన్. ఇలా దూరం దూరంగా ఉండి నితిన్ తన వైఫ్ బర్త్ డే సెలబ్రేషన్స్ చేశాడు.

Shruthi Hassan : మళ్ళీ తెలుగులో బిజీ అవుతున్న శృతిహాసన్

నితిన్ ఈ వీడియోని ట్విట్టర్లో షేర్ చేసి… ”కోవిడ్ కి సరిహద్దులు ఉన్నాయేమో, మన ప్రేమకి సరిహద్దులు లేవు, హ్యాపీ బర్త్ డే టు మై లవ్. లైఫ్ లో ఫస్ట్ టైం నువ్వు నెగిటివ్ గా ఉండాలని కోరుకుంటున్నాను” అని పోస్ట్ చేశాడు. ఈ వీడియో చూసిన వాళ్లంతా నితిన్ ని మెచ్చుకుంటూ, తన వైఫ్ అంటే ఎంత ప్రేమో అని కామెంట్స్ చేస్తున్నారు.